https://oktelugu.com/

Champions Trophy 2025: పాకిస్తాన్ చెత్త రికార్డ్.. 23 సంవత్సరాలలో ఏ జట్టుకు సాధ్యం కాని అపఖ్యాతి..

Champions Trophy 2025 మాజీ ఆటగాళ్లు దెప్పి పొడుస్తున్నారు. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మీడియా ధ్వజమెత్తుతోంది.. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టు తలవంపులకు గురయ్యాయి మరో పరిణామం చోటుచేసుకుంది. ఇది ఆ జట్టు ఇజ్జత్ ను నడిబజార్లో తీసేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Written By: , Updated On : February 28, 2025 / 08:58 AM IST
Champions Trophy 2025 (5)

Champions Trophy 2025 (5)

Follow us on

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు వరుస పరాజయాలు పొందింది. ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్ జట్టు చేతిలో 60 పరుగులు, భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటములు ఎదుర్కొంది.. 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుపై విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దాదాపు 80 సంవత్సరాల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగు పెట్టింది. దానికి తగ్గట్టుగా పాకిస్తాన్ ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడ లేకపోయింది. ఏమాత్రం ప్రతిభ చూపలేక.. స్వదేశంలో చేతులెత్తేసింది. తొలి మ్యాచ్ కరాచీలో జరగగా.. న్యూజిలాండ్ జట్టుకు ఏమాత్రం పాకిస్తాన్ పోటీ ఇవ్వలేకపోయింది. బౌలింగ్లో తడబడింది. బ్యాటింగ్లో చేతులెత్తేసింది. ఇక దుబాయ్లో జరిగిన మ్యాచ్లో భారత్ ఎదుట పాకిస్తాన్ సాగిలపడింది. బౌలింగ్ కు అనుకూలించే మైదానంపై బ్యాటింగ్ చేసింది. భారత్ ఎదుట స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది. దీంతో భారత్ ఆడుతూ పాడుతూ ఆ టార్గెట్ చేజ్ చేసింది.

Also Read: ఇంగ్లాండ్ మీదే.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు.. గణాంకాలు ఎలా ఉన్నాయంటే..

చెత్త రికార్డు

పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీలో దారుణమైన వైఫల్యం ప్రదర్శించిన నేపథ్యంలో.. అత్యంత చెత్త రికార్డును నమోదుచేసింది. గత 23 సంవత్సరాల లో ఒక ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తూ.. ఒక మ్యాచ్ కూడా గెలవనిజట్టుగా పాకిస్తాన్ నిలిచింది. 2000 సంవత్సరంలో కెన్యా ఈ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. 1996 తర్వాత పాకిస్తాన్ జట్టుకు ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. క్రమంలో 590 కోట్ల రూపాయల ఖర్చుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మైదానాలను శోభాయమానంగా తీర్చిదిద్దింది. తమ జట్టు 2017 మాదిరిగానే విజేతగా నిలుస్తుందని భావించింది. దానికి తగ్గట్టుగానే ఆటగాళ్లకు సదుపాయాలు కల్పించింది. కానీ బయట మాత్రమే పులి.. మైదానంలో పేపర్ పులి అన్నట్టుగా పాకిస్తాన్ ఆట తీరు కొనసాగింది. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ వాళ్లంతా విఫలమయ్యారు. బ్యాటింగ్లో తడబడ్డారు. బౌలింగ్లో చేతులెత్తేశారు. ఫీల్డింగ్లో నిరాశ కలిగించారు. ఫలితంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల్లో నిరాశ కలిగించారు. ఈ ప్రదర్శన నేపథ్యంలో పాకిస్తాన్ ఆట తీరు దారుణంగా మారిపోయిందని.. ఇప్పటికిప్పుడు ఆ జట్టు బాగుపడాలంటే అద్భుతం జరగాలని పాకిస్తాన్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు..” గడచిన 23 సంవత్సరాల లో ఐసీసీ టోర్నికి ఆతిథ్యం ఇచ్చిన జట్టు ఒక మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. కానీ ఆ రికార్డును పాకిస్తాన్ తన పేరు మీద రాసుకుంది. గొప్ప గొప్ప రికార్డులు అయితే పాకిస్తాన్ ఎలాగో తన పేరు మీద రాసుకోలేదు. ఇలాంటి చెత్త రికార్డులను మాత్రమే పాకిస్తాన్ సృష్టించగలదు. ఇలానే పోతే కెన్యా మాదిరిగానే పాకిస్తాన్ పని కూడా అవుతుంది. అప్పుడు అక్కడ క్రికెట్ భవితవ్యం కూడా ప్రమాదంలో పడుతుందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

 

Also Read: టీం ఇండియాను కలవరపాటుకు గురిచేస్తున్న న్యూజిలాండ్ రికార్డులు..