https://oktelugu.com/

ICC Rankings : బంగ్లాదేశ్ తో ఓటమి.. పాక్ జట్టుకు కోలుకోలేని దెబ్బ.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఎంతకు పడిపోయిందంటే..

బంగ్లాదేశ్ జట్టుతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను పాకిస్తాన్ కోల్పోయింది. 2-0 తేడాతో పరాజయం పాలై పరువు తీసుకుంది. ఈ విజయం ద్వారా బంగ్లాదేశ్ జట్టు ఐసీసీ పాయింట్ల పట్టికలో ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి మేటి జట్లను పక్కనపెట్టి న్యూజిలాండ్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 4, 2024 / 10:25 PM IST

    Pakistan's rank fell in the ICC rankings after losing to Bangladesh

    Follow us on

    ICC Rankings: ఇక బంగ్లాదేశ్ జట్టుతో 2-0 తేడాతో ఓడిపోయిన పాకిస్తాన్ స్వదేశంలో పరువు పోగొట్టుకుంది. అంతర్జాతీయంగానూ నవ్వుల పాలైంది. అంతేకాదు ఐసీసీ టెస్ట్ ర్యాంకులలో మరింత పతనమైంది.. ఏకంగా ఎనిమిదో స్థానానికి దిగజారింది. పాకిస్తాన్ అంతకుముందు ఆరో స్థానంలో ఉండేది. బంగ్లాదేశ్ జట్టుతో వరుసగా రెండు టెస్టులలో ఓడిపోవడంతో రెండు స్థానాలను కోల్పోయింది. ఫలితంగా ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.. ప్రస్తుతం పాకిస్తాన్ తర్వాత వెస్టిండీస్ మాత్రమే ఉంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాలో 9 జట్లు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ వెస్టిండీస్ జట్టు కంటే మాత్రమే ముందు వరుసలో ఉంది..” పాకిస్తాన్ రెండు స్థానాలను నష్టపోయింది. ఐసీసీ మెన్స్ టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాలో ఎనిమిదో స్థానానికి దిగజారింది. స్వదేశంలో బంగ్లాదేశ్ జట్టుతో తలపడిన సిరీస్లో పాకిస్తాన్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. ఈ సిరీస్ కంటే ముందు పాకిస్తాన్ ఆరవ స్థానంలో ఉండేది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో ఎనిమిదవ స్థానానికి దిగజారిందని” ఐసీసీ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు 76.లతో ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతోంది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 124 పాయింట్లు, భారత్ 120 పాయింట్లు, ఇంగ్లాండ్ 108 పాయింట్లతో మొదటి మూడు స్థానాలలో కొనసాగుతున్నాయి.

    పాకిస్తాన్ జట్టుతో జరిగిన సిరీస్ గెలవడం ద్వారా బంగ్లాదేశ్ ఏకంగా నాలుగో స్థానానికి చేరుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా నిర్వహిస్తున్న టెస్ట్ సిరీస్ లలో బంగ్లాదేశ్ 2-0 తేడాతో పాకిస్తాన్ జట్టుపై వారి సొంత దేశంలో గెలిచింది. ఇక వచ్చే ఏడాది ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ పోటీ జరుగుతుంది. ఐసీసీ టెస్ట్ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ లో తలపడతాయి. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్ 68.52(విజయాలు) శాతం, ఆస్ట్రేలియా 62.50% తో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. న్యూజిలాండ్ 50%తో మూడో స్థానంలో ఉంది.. పాకిస్తాన్ జట్టుపై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ 45.84 తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకపై ఇంగ్లాండు గెలిచినప్పటికీ 45 శాతంతో ఐదవ స్థానానికి పరిమితం అయిపోయింది. అయితే ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ ఆస్ట్రేలియా – భారత్ మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత ఏడాది కూడా ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ జరిగింది. అ పోటీలో ఆస్ట్రేలియా విజయం సాధించింది