IND vs PAK : ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్ లో పాకిస్తాన్(Pakistan)ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో టీం ఇండియా సెమీఫైనల్లో(semi final) తన బెర్త్ ను దాదాపు కన్ఫాం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి దాదాపు నిష్క్రమించే పరిస్థితి నెలకొంది. భారత జట్టు ఈ చారిత్రాత్మక విజయానికి ముఖ్య కారణం విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు. అతడు అజేయ సెంచరీ చేసి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. సెంచరీ ఇన్నింగ్స్ ఆడి నాటౌట్ గా 100 పరుగులు చేశాడు. దీనికి ముందు కుల్దీప్ యాదవ్ భారత జట్టు తరపున 3 వికెట్లు పడగొట్టాడు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy ) ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ఇప్పుడు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 241 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 45 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేజ్ చేసి మెమోరబుల్ విక్టరీని అందుకుంది. విరాట్ ఒక ఫోర్ కొట్టడం ద్వారా తన సెంచరీని పూర్తి చేయడమే కాకుండా, భారత జట్టకు ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.
విరాట్ కోహ్లీ 82వ సెంచరీ
ఇది వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli)కి 51వ సెంచరీ. వన్డే మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కోహ్లీకి 82వ సెంచరీ. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ 111 బంతులు 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. విరాట్ తన ఇన్నింగ్స్‌లో కేవలం 7 ఫోర్లు మాత్రమే కొట్టాడు. ఈ మ్యాచ్ తో విరాట్ తన వన్డే కెరీర్ లో 14,000 పరుగులు కూడా పూర్తి చేసుకుని సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య ఇది ఆరో మ్యాచ్. దీనికి ముందు రెండు జట్లు మొత్తం ఐదు సార్లు తలపడగా అందులో పాకిస్తాన్ 3 సార్లు గెలిచింది.. టీం ఇండియా 2సార్లు మాత్రమే విజయం సాధించింది. 3- 2 గా స్కోర్ ను ఇప్పుడు టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలో 3- 3గా సమం చేసింది.