Pakistan Vs Sri Lanka: ఏషియా కప్ లో భాగంగా ఆడిన సూపర్ ఫోర్ లో శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ జుట్టు ఫైనల్ కి చేరుకుంటుంది కాబట్టి ఇరు జట్లు కూడా గెలవాలని ఒక సంకల్పంతో ఆడినట్టుగా కనిపించింది. అయితే ఈ మ్యాచ్ కి వర్షం అడ్డంకి గా మారినప్పటికీ 42 ఓవర్లకు కుదించి మ్యాచ్ ను నడిపించారు మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 252 పరుగులు చేసింది. అందులో శాఫిక్ 52 పరుగులు చేయగా, మహమ్మద్ రిజ్వాన్ 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.ఇక ఇఫ్తికర అహ్మద్ కూడా 47 పరుగులు చేశాడు. ఇలా వీళ్లు ముగ్గురు రాణించడంతో పాకిస్తాన్ 252 పరుగులు చేయగలిగింది. ఇక శ్రీలంక బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు మొదటి నుంచి కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. మతిషా పతిరాన, 3 వికెట్లు తీశాడు. అలాగే మహేష్ తీక్షణ ఒక వికెట్ తీశాడు అలాగే దునీత్ వెల్లలాగే కూడా ఒక వికెట్ తీశాడు.
ఇక 253 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మొదట్లో కొంచెం తడబడినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్ శ్రీలంక ప్లేయర్లు విన్నింగ్ దిశగా తీసుకు పోవడం జరిగింది. ఇక శ్రీలంక బ్యాట్స్ మెన్స్ లో కుశాల్ మేండిస్ 91 పరుగులు చేశాడు అలాగే సదిరా 48 పరుగులు చేశాడు అలాగే అస్లంక 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే రెండోవలలో చాలా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే 41 ఓవర్ 4 , 5 బంతులకి శ్రీలంక వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 243 పరుగులు మాత్రమే… అయితే 246 పరుగులు ఉన్నప్పుడు చివరి నాలుగో బంతికి మరో వికెట్ ని నష్టపోయింది. దీంతో అప్పటివరకు శ్రీలంక వైపు ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయింది.
అయితే అప్పటికే క్రీజు లో ఉన్న అసలంక ఐదో బంతికి ఫోర్ కొట్టాడు,అలాగే చివరి బంతికి రెండు పరుగులు తీశాడు. ఇలా చివరి బంతి వరకు ఉత్కంఠ గా సాగిన పోరులో శ్రీలంక విజయం సాధించింది. ఇక దీంతో శ్రీలంక ఫైనల్ చేరుకోగా, పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయింది. 91 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.ఇక ఈ విజయంతో శ్రీలంక ఆసియా కప్ లో 11వసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక శ్రీలంక ఈ ఆదివారం ఇండియా తో పాటు ఏషియా కప్ ఫైనల్ ని ఆడనుంది. ఇక ఈ రెండు టీముల్లో ఏ టీమ్ కి కప్పు వచ్చే అవకాశం ఉందో చెప్పడం కష్టమే అది తెలియాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయక తప్పదు…