PAK Vs NZ
PAK Vs NZ: ” టాస్ గెలిచావ్. కరాచీ మైదానం గురించి నీకు అంతా తెలుసు. అలాంటప్పుడు బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నావ్.. సరే ఆ నిర్ణయం తీసుకున్నావ్.. న్యూజిలాండ్ బౌలర్ల ముందు నీ జట్టు ప్లేయర్లు తలవంచుతుంటే ఏం చేశావు.. కీలకమైన సమయంలో అవుట్ అయ్యావు.. ఇప్పుడు చూడు ఏం జరిగిందో” ఇవీ న్యూజిలాండ్ జట్టు చేతిలో ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ పై సొంత దేశానికి చెందిన నెటిజన్లు చేస్తున్న ఆరోపణలు.
శుక్రవారం రాత్రి కరాచీ మైదానం వేదికగా ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.. వాస్తవానికి ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గెలవాల్సిన చోట పాకిస్తాన్ ఓడిపోయి పరువు తీసుకుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆటగాళ్లు కీలక సమయంలో అవుట్ కావడంతో.. ఆ జట్టు భారీ స్కోర్ చేయలేకపోయింది. అది న్యూజిలాండ్ జట్టుకు అడ్వాంటేజ్ గా మారింది. బౌలింగ్లో న్యూజిలాండ్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. పాకిస్తాన్ జట్టును ఏ దశలోనూ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. సొంత మైదానంలో ఆడుతున్నప్పటికీ పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళను డిఫెన్స్ లో పడేశారు. పేస్, స్పిన్ బౌలింగ్ తో ఎటాకింగ్ చేయించారు.. ఫలితంగా పాకిస్తాన్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. మహమ్మద్ రిజ్వాన్ కీలక సమయంలో అవుట్ అయ్యాడు. సల్మాన్ ఆఘా భారీ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. తాయబ్ తాహిర్ అనవసరమైన షాట్ కు యత్నించి అవుట్ అయ్యాడు. వీరంతా కూడా 40 పరుగుల లోపే అవుట్ కావడం విశేషం.
సోషల్ మీడియాలో ట్రోల్స్
గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో సోషల్ మీడియాలో పాకిస్తాన్ ఆటగాళ్లపై ట్రోల్స్ నడుస్తున్నాయి.. ముఖ్యంగా మహమ్మద్ రిజ్వాన్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ అభిమానులు మండిపడుతున్నారు. ” కరాచీ మైదానం ఎలా ఉంటుందో తెలుసు కదా.. అలాంటప్పుడు బౌలింగ్ ఎంచుకోవాలి కదా.. పోనీ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కెప్టెన్ గా చివరి వరకు క్రీజ్ లో ఉండాలి కదా.. అలా చేయకుండా ఇలా అవుట్ అయ్యావంటే ఏమనుకోవాలని” నెటిజన్లు మండిపడుతున్నారు. బాబర్ అజాం పై కూడా ఇదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ” నీకు గుర్తుందా బాబర్.. 2023లో నేపాల్ జట్టుపై జరిగిన మ్యాచ్లో నువ్వు సెంచరీ చేశావు. ఆ తర్వాత నువ్వు ఆ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడావా? అంటే నువ్వు నేపాల్ పై మాత్రమే ఆడతావా? అలాంటప్పుడు న్యూజిలాండ్ సిరీస్ లో నిన్ను ఎందుకు ఎంపిక చేశారు? ఎంపిక చేసినప్పుడు ఆడేందుకు నువ్వెందుకు ఒప్పుకున్నావ్? ఇందుకోసమేనా.. ఫైనల్ మ్యాచ్లో నువ్వు చేసేది 29 పరుగులా? న్యూజిలాండ్ జట్టుపై ఈ పరుగులతో ఫైనల్ మ్యాచ్లో గెలుద్దామని అనుకున్నావా? ఇలాంటి ఆట ఛాంపియన్స్ ట్రోఫీ ని పాకిస్తాన్ జట్టుకు మరోసారి తీసుకువస్తుందా” అంటూ పాక్ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.
King Babar scored his last ODI century against the mighty Nepal in Asia Cup 2023.#BabarAzam #PAKvNZ #PakvsNz pic.twitter.com/HLyiekArIW
— सृष्टि रॉय | Sristi ROY (@Oppressor_Speak) February 14, 2025
Hum ne jeet Jana tha, agar Kali Rasta na kat-ti ••••••
️captain M•Rizwan#PakvsNz #PAKvNZpic.twitter.com/zJR9RD18dg
— (@sabz80_) February 14, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Pakistan vs new zealand highlights tri series final nz clinch title with 5 wicket win in karachi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com