Odi World Cup 2023: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ మొత్తం వరల్డ్ కప్ లో నిమగ్నమై మ్యాచులు ఆడుతున్న నేపధ్యం లో కొన్ని జట్లు భారీ విజయాలను అందుకుంటుంటే మరి కొన్ని జట్లు మాత్రం ఒక్క గెలుపు కోసం చాలా కష్టపడుతున్నాయి. ఇక ఇలాంటి క్రమం లో నిన్న ఇంగ్లాండ్ టీం ని ఆఫ్గనిస్తాన్ టీం చిత్తు చేసింది.
దాంతో వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఒక్కసారి గా షాక్ కి గురయ్యారు. ఇక ఇలాంటి నేపధ్యం లో నిన్న సౌతాఫ్రికా టీం ని నెదర్లాండ్ టీం చిత్తు చేయడం చూసిన అభిమానులకి వరల్డ్ కప్ లో రోజుకొక షాక్ తగులుతుంది.ఇక ఇది ఇలా ఉంటె ఇండియన్ టీం మీద మ్యాచ్ ఓడిపోయిన పాకిస్థాన్ టీం ప్లేయర్లందరికి కూడా వైరల్ ఫీవర్ రావడం జరిగింది.నిజానికి పాకిస్థాన్ టీం ఇండియన్ టీం మీద ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.అందుకే ఈ టీంలో కొంతమందికి ఫీవర్ వచ్చిందంటూ కొందరు కామెంట్ చేస్తుంటే, పిసిబి బోర్డు మాత్రం తమ ప్లేయర్లకి బెంగుళూర్ వాతావరణం సరిగ్గా సెట్ అవ్వకపోవడం వల్లే ఫీవర్స్ వస్తున్నాయి అని తెలియజేయడం జరిగింది.
ఇక ఇలాంటి నేపధ్యం లో ఆ టీం లోని షాహిన్ ఆఫ్రిది, షఫీక్ లాంటి మెయిన్ ప్లేయర్లకి కూడా చాలా హై ఫీవర్ ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక బెంగుళూర్ వేదిక గా పాకిస్థాన్ టీం శుక్రవారం రోజున ఆస్ట్రేలియా తో ఒక మ్యాచ్ ఆడబోతుంది.ఇక ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టీం లో ఎవరెవరు ఉంటారు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశం గా మారింది…
ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా పాకిస్థాన్ గెలవాలి లేకపోతే ఆ జట్టు సెమిస్ కి వెళ్లడం కష్టం అవుతుంది.మరి కీలకమైన సమయంలో ఇలా పాకిస్థాన్ ప్లేయర్లు అనారోగ్యానికి గురి కావడం కొత్త వరకు ఆ టీం కి మైనస్ అనే చెప్పాలి. ఇక ఇండియన్ టీంతో మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ కూడా పాకిస్థాన్ టీం మీదకి కోపానికి వస్తు ఆయన పాకిస్థాన్ టీం కెప్టెన్ అయిన బాబర్ అజమ్ మీద తీవ్రం గా ఫైర్ అయ్యారు.బాబర్ అజమ్ కెప్టెన్ గా పనికి రాడు ఆయన కెప్టెన్సీ అంత బాగలేదు.
దాంతో ఆయనని కెప్టెన్ గా తీసివేసి షాహిన్ ఆఫ్రిది కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుంది అని మాట్లాడాడు.ఇక దానిని కండిస్తూ పాకిస్థాన్ మరో మాజీ ప్లేయర్ అయిన మహమ్మద్ యూసఫ్ బాబర్ అజమ్ కి మద్దతు గా మాట్లాడటం జరిగింది.ఇక ఇప్పుడు పాకిస్థాన్ టీం అస్తవ్యస్తం గా ఉంది ఇక దానికి తోడు గా వరల్డ్ కప్ లో సెమిస్ కి అయిన చేరుతారా లేదా అనేది చూడాలి…