Virat Kohli : ఆదివారం దుబాయ్ లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు అన్ని విభాగాలలో భారత్ ముందు తలవంచింది. భారత ఆటగాళ్లను ఔట్ చేసే అవకాశాన్ని కూడా చేతులారా కోల్పోయింది. విరాట్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 21 ఓవర్ ను రౌఫ్ వేశాడు. ఆ ఓవర్ ఐదో బంతికి విరాట్ కోహ్లీ సింగిల్ రన్ తీసాడు. పెద్దగా ఇబ్బంది లేకుండానే క్రీజ్ లోకి చేరుకున్నాడు. కానీ అదే క్రమంలో ఫీల్డర్ వదిలిన బంతిని చేతితో పట్టుకున్నాడు. అయితే ఆ బంతిని ఓవర్ త్రో కాకుండా అడ్డుకున్నాడని పాకిస్తాన్ ఫీల్డర్లు మనసులో సంతోషించారు. కానీ విరాట్ కోహ్లీ అలా బంతి అంది కోవడం తప్పు. పాకిస్తాన్ ఫీల్డర్లు కనుక ఆ సమయంలో అప్పీల్ చేసి ఉంటే విరాట్ కోహ్లీ పెవిలియన్ చేరుకునేవాడు. వాస్తవానికి ఆ బంతిని విరాట్ కోహ్లీ దురుద్దేశంతో అడ్డుకోలేదు. సాంకేతికంగా విరాట్ కోహ్లీ చేసిన పని తప్పే. అది విరాట్ కోహ్లీని ఔట్ గా ప్రకటించాల్సిన తప్పు అది. ఒకవేళ అదే గనుక జరిగి ఉంటే టీమిండియా తీవ్రమైన ఇబ్బందుల్లో పడేది.. ఒకవేళ ఆ బంతిని గనక విరాట్ అడ్డుకొని పోయి ఉంటే ఓవర్ త్రో అయ్యేది. టీమిండియా కు పరుగులు వచ్చేవి. సమయానికి విరాట్ కోహ్లీ కూడా అలా ఆలోచించలేదేమో. పైగా దేవుని పాకిస్తాన్ ఆటగాళ్లు పెద్దగా గమనించలేదు.. కోహ్లీ అడ్డుకోవడం వల్లే తమకు ఒక పరుగు మిగిలిన దాన్ని సంబరపడ్డారు. అయితే ఇదే తప్పను సునీల్ గవాస్కర్ తన కామెంట్రీ లో చెప్పాడు.. కానీ అప్పటికే సమయం ముగిసిపోవడంతో పాకిస్తాన్ ప్లేయర్లు నాలుక కరుచుకున్నారు.
ఆ తర్వాత అవకాశం ఇవ్వలేదు
ఇక అప్పట్నుంచి పాకిస్తాన్ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా పాకిస్తాన్ స్పిన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ స్పిన్ బౌలింగ్లో ఆడేందుకు భారత ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అందులో విరాట్ కోహ్లీ కూడా ఒకడు. అయితే ఎప్పుడైతే అహ్మద్ గిల్ ను అవుట్ చేసి.. “వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో” అని అర్థం వచ్చేలా స్లెడింగ్ చేశాడో.. అప్పటినుంచి విరాట్ కూడా తన స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడాడు. మ్యాచ్ చూసిన తర్వాత తనదైన హావభావాన్ని అబ్రార్ అహ్మద్ కు చూపించాడు విరాట్.” చూసావు కదా ఇదీ మా సత్తా ” అన్నట్టుగా అబ్రార్ అహ్మద్ కు కటింగ్ ఇచ్చాడు. స్థూలంగా చెప్పాలంటే కోహ్లీ ని అవుట్ చేయాలని తొందర్లో పడి.. పాకిస్తాన్ ఆటగాళ్లకు బుర్ర పనిచేయలేదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఫలితంగా స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించాల్సిన అపప్రదను మూట కట్టుకోవాల్సి వచ్చింది.