How long to boil an egg: గుడ్డు ఎప్పటికైనా వెరీ గుడ్డు గానే ఉంటుంది.. ఎందుకంటే కోడి గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తినమని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. ఎదిగే పిల్లల కోసం ప్రతిరోజు కోడిగుడ్డు ఇవ్వడం ఎంతో అవసరం. అయితే కోడి గుడ్డును రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. కొందరు బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే.. మరికొందరు ఆమ్లెట్ రూపంలో తింటూ ఉంటారు. ఆమ్లెట్ కంటే బాయిల్డ్ ఎగ్ ఎంతో మంచిదని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ఈ బాయిల్డ్ ఎగ్ కూడా కావలసిన విధంగా తీసుకోవచ్చు. అంటే గుడ్డులోని పచ్చ సోనా కొందరు సాధారణంగా ఉడికేలా చూస్తే.. మరి కొందరు ఇది గట్టిగా ఉండేలా చూస్తారు.. ఇలాంటి అప్పుడు గుడ్డును ఎంతసేపు ఉడికిస్తే మనకు కావాల్సిన విధంగా తయారవుతుంది?
బాయిల్డ్ ఎగ్ ను రెండు రకాలుగా ఉడికించుకోవచ్చు. ఒకటి సాఫ్ట్ బాయిల్.. మరొకటి హార్డ్ బాయిల్.. పచ్చ సోనా లేతగా ఉండడానికి సాఫ్ట్ బాయిల్ చేస్తారు. ఇలా రావడానికి 5 లేదా 6 నిమిషాల పాటు కోడి గుడ్డును ఉడికించాలి. అలాగే పచ్చ సోనా గట్టిగా ఉండేవారు కోడి గుడ్డును 9 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేస్తే కావలసిన బాయిల్డ్ ఎగ్ వస్తుంది. గుడ్డును ఉడికించేటప్పుడు పాత్రలో ముందుగా నీరు పోసి అందులో గుడ్లు పూర్తిగా మునిగేలా చూడాలి. మరిగే నీటిలో గుడ్డు వేయకూడదు. వేడినీటిలో ఉండగానే గుడ్డు బయటకు తీయరాదు. మరిగించిన పాత్రను కాసేపు చల్లారిన తర్వాత అందులో నుంచి గుడ్డు తీయాలి. ఇలా చేస్తేనే గుడ్డుపై ఉన్న పొర ఈజీగా వస్తుంది.
అయితే పచ్చ సోనా గట్టిగా ఉండేలా ఉడికిస్తే ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనిని సలాడ్లో కూడా వాడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. 12 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉడికించిన గుడ్డులో ఐరన్, సల్ఫర్ మధ్య రియాక్షన్ ఏర్పడుతుంది. దీంతో ఈ గుడ్డును తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కోడిగుడ్డును పది నిమిషాల లోపు ఉడికించి మాత్రమే తినాలి.
ప్రతిరోజు కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో బి2 విటమిన్, ఐరన్, జింక్, కాల్ చేయమంటే ఖనిజాలు ఉన్నాయి. ఇందులో ఉండే అమైను ఆమ్లాలు శరీర అభివృద్ధికి సహకరిస్తాయి. ప్రతిరోజు గుడ్డు తినడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెంపొందుతుంది. పిల్లల ఎదుగుదల కోసం ప్రతిరోజు గుడ్డు ఇవ్వడం ఎంత అవసరం. వీరిలో రోగ నిరోధక శక్తి పెరిగి ఉత్సాహంగా ఉండగలుగుతారు. వ్యాయామం చేసేవారు ప్రతిరోజు కోడి గుడ్డు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే ఆమ్లెట్ తినేవారు ఇందులో కూరగాయలను కలిపి తింటే ప్రయోజనం ఉంటుంది.