Pakistan Cricket Board: ఆ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించినప్పుడు.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తిక్క వేషాలు వేసింది. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రదర్శించాలని తాపత్రయపడింది. ఈ విషయం భారత క్రికెట్ మేనేజ్మెంట్ దృష్టికి వచ్చింది. వెంటనే ఐసీసీని సంప్రదించింది. అంతేకాదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రదర్శిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఈ పరిణామం ఎక్కడికో దారితీస్తుందని ముందుగానే భావించిన ఐసీసీ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు హెచ్చరికలు పంపింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిలిచిపోయింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రదర్శిస్తేనే ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ క్రికెట్ నియంత్రణ మండలి.. ఇప్పుడు ఏకంగా ముగ్గురు ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ల పాకిస్తాన్ సైన్యం కారణమైంది. ఇంతటి దారుణానికి పాల్పడిన తర్వాత ఇప్పుడు ఊరుకుంటుదా.. అందుకే తెర వెనుక మంతనాలు మొదలుపెట్టింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఊపిరి సలపని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మరోవైపు వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ట్రై సిరీస్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆడబోనని స్పష్టం చేసింది. దీంతో ఆఫ్గనిస్తాన్ స్థానంలో మరో జట్టును ఆడించాలని పాకిస్తాన్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి శ్రీలంక కూడా ఆడే అవకాశం లేకుండా పోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల ఆసియా కప్ జరిగినప్పుడు పాకిస్తాన్ ధోరణి అభ్యంతరకరంగా కనిపించింది. మన దేశంపై పహల్గాం కుట్ర కు పాల్పడిన పాకిస్తాన్.. ఆపరేషన్ సిందూర్ చేపడితే అంతర్జాతీయ వేదికల మీద మొసలి కన్నీరు కార్చింది. ఇప్పుడు ఏకంగా మన మీద యుద్ధం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ మీద వైమానిక దాడులకు పాల్పడుతుంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ మనకు దగ్గరయింది. భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కు సహాయం చేస్తామని మాట కూడా ఇచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న పాకిస్తాన్ దొంగ చాటుగా ఆఫ్గనిస్తాన్ మీద వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు ఆఫ్గనిస్తాన్ యువ క్రికెటర్లు కన్నుమూశారు. ముగ్గురు యువకులు చనిపోయిన నేపథ్యంలో అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయకుండా అడ్డగోలుగా దాడులు చేయడాన్ని యావత్ ప్రపంచం మొత్తం తీవ్రంగా ఖండిస్తోంది. ముగ్గురు క్రికెటర్ల మరణానికి కారణమైన పాకిస్తాన్ ను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించాలని డిమాండ్ వ్యక్తమౌతోంది.
అప్పట్లో పాకిస్తాన్ దేశంలో ఆడేందుకు శ్రీలంక క్రికెటర్లు వెళ్లారు.. ఆ సమయంలో పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. శ్రీలంక క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడ్డారు. ఆ సమయంలో శ్రీలంక క్రికెటర్లు వెంట్రుక వాసిలో చావు నుంచి తప్పించుకున్నారు. ఆ ఘటన తర్వాత పాకిస్తాన్ దేశంలో చాలా సంవత్సరాల పాటు అంతర్జాతీయ టోర్నీలు జరగలేదు. ఇటీవల కాలంలో అంతర్జాతీయ టోర్నీలు జరుగుతున్నాయి. పాక్ ఉగ్రవాద దేశం కావడంతో భారత్ ద్విపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. పైగా ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ మ్యాచులను కూడా తటస్థ వేదికలలో భారత్ ఆడుతోంది. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ కూడా అదేదారిని అనుసరిస్తోంది.