Homeక్రీడలుICC Odi Rankings 2023: తొలిసారి వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న పాకిస్థాన్

ICC Odi Rankings 2023: తొలిసారి వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్న పాకిస్థాన్

ICC Odi Rankings 2023: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తొలిసారి పాకిస్థాన్ జట్టు నెంబర్ వన్ గా నిలిచింది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో వరుసగా నాలుగు మ్యాచులు గెలవడంతో ఆస్ట్రేలియా జట్టును వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది పాకిస్తాన్ జట్టు. రెండో స్థానంలో ఆస్ట్రేలియా జట్టు కొనసాగుతుండగా, మూడో స్థానంలో భారత్, నాలుగో స్థానంలో ఇంగ్లాండ్, ఐదో స్థానంలో న్యూజిలాండ్, ఆరో స్థానంలో దక్షిణాఫ్రికా జట్టులు నిలిచాయి.

వన్డే క్రికెట్లో మొట్టమొదటిసారి పాకిస్తాన్ జట్టు ర్యాంకింగ్ లో మొదటి స్థానాన్ని సంపాదించింది. మొన్నటివరకు ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉండగా న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో పాకిస్తాన్ జట్టు అద్భుతంగా ఆడి సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు వన్డేల్లో 4 వన్డేలను పాకిస్థాన్ జట్టు గెలుచుకుని కివీస్ జట్టును కకావికలం చేసింది. అద్భుతమైన ఆట తీరుతో న్యూజిలాండ్ ను ఓడించిన పాకిస్తాన్ జట్టు ఒక్కసారిగా ర్యాంకింగ్స్ జాబితాలో టాప్ లోకి వెళ్లిపోయింది. 113 పాయింట్లతో మూడు జట్లు సమానంగా కొనసాగుతుండగా.. మెరుగైన రన్ రేట్ కారణంగా పాకిస్థాన్ జట్టు టాప్ లో నిలిచింది.

నాలుగు వన్డేల్లో ఘన విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు..

పాకిస్తాన్ జట్టుతో వన్డే, టి20 సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళింది న్యూజిలాండ్ జట్టు. ఐదు వన్డేల్లో నాలుగు వన్డేల్లో ఘన విజయం సాధించింది పాకిస్తాన్ జట్టు. మొదటి వన్డేలో న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి ఏడు వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పాకిస్తాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 48.3 బంతుల్లోనే 291 పరుగులు చేసి విజయం సాధించింది. రెండో వన్డేలో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేయగా, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 48.2 బంతుల్లోనే 337 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేయగా, న్యూజిలాండ్ జట్టు 49.1 ఓవర్ లో 261 పరుగులకు ఆల్ అవుట్ అయి ఓటమిపాలైంది. తాజాగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు భారీ విజయం నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 334 పరుగులు చేయగా, న్యూజిలాండ్ జట్టు 43.4 ఓవర్లలోనే 232 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో 102 పరుగుల భారీ తేడాతో పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. వరుసగా 4 వన్డేల్లోనూ పాకిస్తాన్ జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవడంతోపాటు వన్డే ర్యాంకింగ్స్ లోను నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular