Haris Rauf : టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు గ్రహచారం బాగోలేదు. ఇప్పటికే అమెరికా చేతిలో ఆ జట్టు ఓడిపోయి పరువు తీసుకుంది. పైగా కీలక ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతుండడంతో ఆ జట్టు పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇలాంటి క్రమంలోనే మరో షాకింగ్ లాంటి పరిణామం ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా భారత్ తో మ్యాచ్ కు ముందు ఆ పరిణామం వెలుగులోకి రావడం విశేషం.
పాకిస్తాన్ జట్టులో హరీస్ రౌఫ్ కీలక బౌలర్ గా ఉన్నాడు. అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్టు సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని అమెరికన్ సీనియర్ క్రికెటర్ రష్టీథెరాన్ తప్పు పట్టాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ హరీస్ రౌఫ్ బంతి స్వరూపాన్ని మార్చేందుకు యత్నించాడని ఆరోపించాడు.
“మ్యాచ్ ఉత్కంఠ గా జరుగుతోంది. అమెరికా వైపు మొగ్గింది. దీంతో కొత్తగా తీసుకున్న బంతిని రౌఫ్ తన చేతి వేళ్ళతో గీకడం మొదలుపెట్టాడు. రెండు ఓవర్లకు ముందే ఆ బంతిని మార్చారు. అలాంటి బంతితో మైదానంపై రివర్స్ స్వింగ్ ఎలా రాబడతారు.. అదే చిత్రమో తెలియదు గాని రౌఫ్ తన బొటన వేలును బంతిపై రుద్దాడు. ఆ తర్వాత పరిగెత్తాడు. దానిని మీరు చూడొచ్చని” థెరాన్ ఐసీసీ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.
సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే దీనిపై నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. అలాంటి పనులకు పాల్పడితే రౌఫ్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు..” ఇలాంటి ఆట తీరు సరికాదు. ముందుగా అలాంటి పనులకు పాల్పడిన ఆటగాడిపై ఖచ్చితంగా ఐసిసి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటివి మరిన్ని జరుగుతాయి. అప్పుడు ఐసీసీ సమర్ధతపై అనుమానాలు తలెత్తుతాయని” నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.