Interstellar : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి వారంలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్న సినిమాలను చూసాము కానీ, మొదటి వారం లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్న ఏకైక చిత్రం మాత్రం ‘పుష్ప 2’ మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటి అద్భుతాన్ని మళ్ళీ చూస్తామో లేదో అని ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం ఖాతాలోకి మరో సంచలన ప్రపంచ రికార్డు వచ్చి చేరింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ఇంటర్ స్టెల్లార్’ చిత్రం అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
ఈ సినిమా కేవలం హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద హిట్ అయ్యింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి పాపులర్ సిటీస్ లో ఈ చిత్రం వంద రోజులకు పైగా ఆడింది కూడా. అలాంటి సంచలనాత్మక చిత్రాన్ని రీసెంట్ గానే మరోసారి రీ రిలీజ్ చేసారు. ఓవర్సీస్ లో రీ రిలీజ్ ద్వారా ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లను ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం అవలీలగా దాటిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప చిత్రానికి ఇప్పటి వరకు నార్త్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయి,గల్ఫ్ దేశాలకు కలిపి 30 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
కానీ ఇంటర్ స్టెల్లార్ రీ రిలీజ్ కి మాత్రం కేవలం ఓవర్సీస్ లో 23 మిలియన్ డాలర్ల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది. ఇప్పటికీ హాలీవుడ్ రీ రిలీజ్ చిత్రాలలో అవతార్ సినిమాదే పై చెయ్యి అని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అవతార్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ లో 50 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇంట్రస్టెల్లార్ చిత్రానికి అందులో సగం కూడా రాకపోవడం గమనార్హం. ఓవర్సీస్ లో ‘పుష్ప 2 ‘ చిత్రానికి కూడా ఈ సినిమా దరిదాపుల్లోకి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫుల్ రన్ లో ‘పుష్ప 2 ‘ చిత్రానికి మరో పది మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఈ నెల 20 వ తేదీన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం విడుదల అవుతుంది, ఈ సినిమాకే థియేటర్స్ మొత్తాన్ని కేటాయించే అవకాశాలు ఉండడంతో, పుష్ప 2 కి ఓవర్సీస్ లో అదే చివరి రోజు అవుతుందని సమాచారం.