Pahalgam Attack: ఈ పర్యాటకుల్లో పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని తుపాకులు ఎక్కుపెట్టి కాల్చారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుపెడితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరకు ఖండించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హుటాహుటిన కాశ్మీర్ వెళ్లిపోయారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. గవర్నర్, ఇతర రక్షణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తున్నారు. ఈ జాబితాలో మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్ – ముంబై జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో.. రెండు జట్లకు చెందిన ఆటగాళ్లు, ఐపీఎల్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Also Read: రక్తం ఉడికిపోతుంది.. ఇకపై ఊరుకునేది లేదు.. పహల్గాం ఉగ్రదాడిపై RCB మాజీ ఆటగాడు!
ఇక ప్రస్తుత ఐపీఎల్ లో సొంత గడ్డపై పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ వీర విహారం చేసింది. అంతకుముందు వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కొంది. దీంతో హైదరాబాద్ లైన్ లోకి వచ్చిందని అందరూ అనుకున్నారు. మళ్లీ ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలైంది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను కఠిన తరం చేసుకుంది. మరోవైపు ముంబై జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొని.. ఇప్పుడు విజయాల బాట పట్టింది. తొలి ఐదు మ్యాచ్ లలో ఒకే ఒక విజయాన్ని అందుకున్న ముంబై.. ఆ తర్వాత హ్యాట్రిక్ గెలుపులను సొంతం చేసుకుంది. మొత్తంగా నాలుగు విజయాలతో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం లో జరుగుతుంది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ అంటే బాణసంచా కాల్చుతారు. చీర్ లీడర్స్ ఆటపాటలతో సందడి చేస్తారు. అయితే బుధవారం నాటి మ్యాచ్లో ఇవేవీ ఉండదు. దానికి కారణం పహల్గాం ఉగ్రదాడి. మంగళవారం ఉగ్రదాడి చోటు చేసుకున్న నేపథ్యంలో.. బాణసంచా కాల్చరు. చీర్ లీడర్స్ సందడి చేయరు. అంతేకాదు ఈ మ్యాచ్లో పాల్గొనే అంపైర్లు, ఆటగాళ్లు నలుపు రంగు బ్యాడ్జీలు ధరిస్తారు. ఒక నిమిషం పాటు పహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ మౌనం పాటిస్తారు.. ఇక పహల్గాం ఘటనలో 28 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. వారందరూ స్థానికంగా ఉన్న ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. పహల్గాం ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉగ్రదాడి జరిగింది. సైనికుల దుస్తులను వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. అనంతరం సమీపంలో ఉన్న అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోయారు. ఇక వారి కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.