https://oktelugu.com/

Team India Defeat Effect : ఒక వ్యక్తి ప్రాణాలు తీసిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్…

ఇలా ఇండియన్ టీం ని నమ్ముకొని పూర్తి కాన్ఫిడెంట్ తో క్రికెట్ మ్యాచ్ చూడడం అనేది మనకే ప్రమాదకరం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గెలుస్తారో , ఎప్పుడు ఓడిపోతారో ఎవరికి తెలియదు కాబట్టి

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2023 / 10:31 AM IST
    Follow us on

    Team India Defeat Effect : వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియన్ టీం ఫైనల్ మ్యాచ్ లో భారీ విజయాన్ని సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇండియన్ టీం ఓడిపోవడం అనేది ప్రతి ఇండియన్ అభిమాని కూడా జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి…

    నిజానికి ప్రతి అభిమాని ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధిస్తే చూడాలని గర్వంగా ఫీల్ అయిపోయి ఎవరికి వాళ్లు టీవీ ముందు అతుక్కుపోయారు. కానీ ఇండియన్ బ్యాట్స్ మెన్స్ నిరాశ పరచడంతో బౌలర్ల మీద కొద్దిపాటి నమ్మకాన్ని ఉంచారు అయినప్పటికీ బౌలర్లు కూడా చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా ఆరోవసారి ప్రపంచ విజేతగా నిలిస్తే ఇండియన్ టీం ఈ సంవత్సరం రెండోసారి ఆస్ట్రేలియా మీద రెండు వరల్డ్ కప్ ( వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్) లో ఓడిపోయి పరువు మొత్తం తీసుకుంది….

    ఇక ఈ క్రమంలో ఇండియా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలామంది టీవీల ముందు ఏడుస్తూ కూర్చున్నారు ఇక ఒక చిన్నారి మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక వెక్కి వెక్కి ఏడవటం చూసిన ప్రతి ఇండియన్ అభిమాని కూడా ఆ పిల్లాడి బాధను అర్థం చేసుకున్నారు.నిజానికి ఇండియన్ టీం అద్భుతమైన పర్ఫామెన్స్ ని కనక ఇచ్చినట్టయితే ఇప్పుడు ఇండియన్ టీం చేతిలో వరల్డ్ కప్ ఉండేది. వరుసగా పది మ్యాచ్ ల్లో గెలిచి ఫైనల్ కి చేరుకొని అత్యున్నత శిఖరాలు అధిరోహించే సమయంలో ఇలా డీలాపడడం అనేది నిజంగా ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయనిది…

    ఇక ఇది ఇలా ఉంటే తిరుపతి లోని స్థానిక రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన జ్యోతి కుమార్ వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ టీవీ లో చూస్తూ భారత్ ఓటమిని జీర్ణించుకోలేక, గుండె పోటుతో మృతి చెందాడు…. మొదట ఇండియన్ ప్లేయర్ల బ్యాటింగ్ చూసి నిరాశ చెందిన జ్యోతి కుమార్ ఆ తర్వాత బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అని వేచి చూశాడు. మొదట్లో మన బౌలర్లు మూడు వికెట్ తీయడంతో కప్పు మనదే అని చాలా సంతోషపడి పూర్తి మ్యాచ్ చూసేసరికి ఇండియన్ టీం చేతులెత్తేయడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురై ఒక్కసారిగా టీవీ ముందు కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న తన స్నేహితులు అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో అప్పటికే అతను మరణించినట్టుగా డాక్టర్లు తెలియజేశారు…

    ఇలా ఇండియన్ టీం ని నమ్ముకొని పూర్తి కాన్ఫిడెంట్ తో క్రికెట్ మ్యాచ్ చూడడం అనేది మనకే ప్రమాదకరం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు గెలుస్తారో , ఎప్పుడు ఓడిపోతారో ఎవరికి తెలియదు కాబట్టి అలా భారీ అంచనాలు పెట్టుకుని మ్యాచ్ చూడకుండా ఏదో లైట్ వెయిట్ తో సరదాగా మ్యాచ్ చూసి వదిలేయడం మంచిది అని చాలామంది క్రికెట్ మేధావులు సైతం తెలియజేస్తున్నారు…