Odi World Cup 2023: వన్డే వరల్డ్ కప్ : సెమీస్ కు ముందు ఇండియన్ టీమ్ ని భయపెడుతోన్న వాంఖడే…

1987వ సంవత్సరంలో కూడా ఇంగ్లాండ్ చేతిలో ఇండియన్ టీమ్ వాంఖడే లోనే ఘోర పరాజయాన్ని చవి చూసింది. అందుకే ఇప్పుడు వాంఖడే స్టేడియం ఇండియన్ టీం ప్లేయర్లతోపాటు,ఇండియన్ టీమ్ అభిమానులను కూడా కొంతవరకు కలవరపెడుతుంది.

Written By: Gopi, Updated On : November 14, 2023 10:26 am

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం వాంఖడే వేదికగా ఈనెల 15వ తేదీన న్యూజిలాండ్ తో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో తలపడనుంది.ఇక ఇప్పటివరకు వరుస విజయాలను అందుకున్న ఇండియన్ టీం సెమీస్ కోసం మాత్రం కొంత భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాంఖడే స్టేడియం గతం లో ఇండియన్ టీమ్ కి అంత పెద్దగా కలిసి రాలేదు ఇంతకుముందు 2016లో టి20 వరల్డ్ కప్ లో ఇండియా సెమీఫైనల్ వరకు వచ్చి వాంఖడే లో ఓడిపోయి వెనుదిరగాల్సి వచ్చింది.

ఇక అలాగే 1987వ సంవత్సరంలో కూడా ఇంగ్లాండ్ చేతిలో ఇండియన్ టీమ్ వాంఖడే లోనే ఘోర పరాజయాన్ని చవి చూసింది. అందుకే ఇప్పుడు వాంఖడే స్టేడియం ఇండియన్ టీం ప్లేయర్లతోపాటు,ఇండియన్ టీమ్ అభిమానులను కూడా కొంతవరకు కలవరపెడుతుంది. అయితే కొన్ని షరతులను పాటిస్తూ మ్యాచ్ లు ఆడితే ఇండియన్ టీమ్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఇప్పటికే మాజీ క్రికెటర్లు ఇండియన్ టీం కి సలహాలు ఇవ్వడం జరుగుతుంది.

ఇక వాంఖడే పిచ్ స్వతహాగా బ్యాటింగ్ పిచ్ అవడంతో మొదట బ్యాటింగ్ చేస్తే ఇక్కడ భారీ పరుగులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దానితో పాటుగా ప్రెజర్ ని కంట్రోల్ చేసుకుంటూ ఇండియన్ టీం ఎప్పటికప్పుడు వ్యూహాలను రచిస్తూ మ్యాచ్ పొజిషన్ ని, ప్రత్యర్థి ప్లేయర్ యొక్క ఆట తీరని అంచనా వేస్తూ ఆడితే వాంఖడే లో ఇండియన్ టీమ్ గెలుపు చాలా ఈజీ అవుతుంది అని మన మాజీ ప్లేయర్లు కూడా వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక నిజానికి ఇండియన్ టీం ఉన్న ప్రస్తుత ఫామ్ కి ఈ మ్యాచ్ ను గెలవడం పెద్ద కష్టమైతే కాదు ఎందుకంటే మన ప్లేయర్లు ప్రతి ఒక్కరు కూడా తమ పూర్తి ఎఫర్ట్ పెట్టి ప్రతి మ్యాచ్ ను విజయ తీరాలకు ఎలా చేర్చాలి అనే దానిమీద మ్యాచ్ లో ఎవరికి వాళ్లు ఒక గొప్ప ఇన్నింగ్స్ ఆడుతూ ఇండియన్ టీం కి మంచి విజయాలను అందిస్తున్నారు.

గత మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్,కే ఎల్ రాహుల్ ఇద్దరూ కూడా అద్భుతమైన సెంచరీలను సాధించి మిడిల్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో మరొకసారి ప్రూవ్ చేశారు. దానివల్ల ఒకవేళ ఓపేనర్లు భారీ ఇన్నింగ్స్ ఆడడంలో ఫెయిల్ అయిన కూడా మిడిల్ ఆర్డర్ గానీ, లోయర్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు గానీ మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్తు భారీ నాక్ ఆడే అవకాశం అయితే ఉంది. ఇక ఇండియన్ టీం ని ఓడించడం ప్రత్యర్థి జట్టుకి చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ఇండియన్ టీం ను చూస్తేనే ప్రత్యర్థి జట్లు సైకలాజికల్ గా కొంత డిస్టర్బ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇండియన్ టీం దేనికి భయపడాల్సిన అవసరం లేదు.వాంఖడే లో ఎప్పుడు ఒకే సిచువేషన్ ఎదురవుతుందనే అపోహలను వదిలి , అలాగే న్యూజిలాండ్ మీద ఇప్పటివరకు మనం నాకౌట్ మ్యాచ్ లో గత కొద్ది సంవత్సరాలుగా గెలవలేక పోతున్నాం అనే నెగిటివ్ థాట్స్ ని వదిలేసి ప్లేయర్లు ఓపెన్ మైండ్ తో, ఫ్రెష్ థాట్స్ తో ముందుకి కదిలితే బాగుంటుందని మాజీ ప్లేయర్లు సైతం ఇండియన్ టీం కి భరోసాని ఇస్తు వాళ్ళ వంతు సజెషన్స్ ని ఇవ్వడం జరుగుతుంది..