ODI World Cup 2023 – Semis : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకున్న ఇండియన్ టీమ్ సెమిస్ కి చేరుకుంది.ఇక ఇలాంటి క్రమంలో మిగితా మూడు ప్లేస్ ల కోసం మిగిలిన టీములు పోటీ పడుతున్నాయి. నిన్నటి మ్యాచ్ తో ఇండియా సెమీస్ కి వెళ్తే ఇంగ్లాండ్ మాత్రం ఆల్మోస్ట్ సెమీస్ నుంచి అవుట్ అయిపోయి ఇంటికి వెళ్లడానికి ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. ఇక ఇప్పటికే ఆరు మ్యాచులు ఆడిన సౌతాఫ్రికా టీం ఐదు మ్యాచ్ ల్లో గెలిచి నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతుంది.
ఇక నెంబర్ త్రీ లో న్యూజిలాండ్ నాలుగు విజయాలతో ఉండగా, ఇక నెంబర్ ఫోర్ లో ఆస్ట్రేలియా కూడా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి సెమిస్ కోసం మిగతా టీంల కంటే ముందు వరుసలో నిలబడింది. ఇక ఈ మూడు టీంలు సెమీస్ బరి లో ఉండగా ఇండియన్ టీం ఇప్పటికే సెమిస్ బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకొని ఈ మూడు టీముల కంటే ముందు వరుసలో ఉంది. అలాంటి క్రమంలో వీటిని వెనక్కి నెట్టి ముందుకు రావడానికి మిగతా టీంలకి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ అవి ఇక మీదట ఆడే అన్ని మ్యాచ్ లు గెలవాలి ఇక దాంతో పాటు గా వాళ్ల రన్ రేట్ ని కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక ఇలాంటివి కనక చూసుకున్నట్లయితే ఇప్పటికి ఈ టీమ్ లకి కూడా సెమీస్ కి చేరే అవకాశం అయితే ఉంది.ఇక ఇంగ్లాండ్ ఆరు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది.
ఇక మీదట ఇంగ్లాండ్ ఆడబోయే మ్యాచ్ లు అన్ని గెలిచిన కూడా ఇంగ్లాండ్ టీం కి సెమిస్ కి వెళ్లే అవకాశాలు అయితే లేవు.నిన్నటి మ్యాచ్ తో ఇండియా సెమీస్ కి వెళ్తే ఇంగ్లాండ్ ఇంటికి వెళ్ళడం ఫిక్స్ చేసుకుంది.ఇక ఆ తర్వాత శ్రీలంక టీం ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడితే అందులో రెండు విజయాలు మాత్రమే నమోదు చేసుకుంది. కాబట్టి శ్రీలంక టీం మిగితా మ్యాచ్ ల్లో విజయాలను సాధిస్తే శ్రీలంక టీం కూడా సెమీస్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఇక పాకిస్తాన్ టీం ఆరు మ్యాచ్ లు ఆడితే అందులో రెండు విజయాలు మాత్రమే నమోదు చేసుకుంది. పాకిస్తాన్ కూడా ఆల్మోస్ట్ ఇంటికి వెళ్లిపోతుందనే చెప్పాలి.
ఒకవేళ మిగిలిన టీమ్ లు అన్ని ఓడిపోయిన కూడా పాకిస్తాన్ టీం భారీ రన్స్ తో గెలవాలి అలా గెలిచినట్లయితే పాకిస్తాన్ సెమీస్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది అంతే తప్ప సాధారణంగా అయితే పాకిస్తాన్ కి ఇప్పుడు అప్పుడే సెమీస్ కి వెల్లే ఛాన్స్ అయితే లేదనే చెప్పాలి. ఇక నెదర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ టీములు కూడా చేరో రెండు మ్యాచ్ ల్లో గెలిచి సెమీస్ కి వెళ్ళడానికి మంచి ఉత్సాహంతో ఉన్నాయి.ఇక ఈ జట్లు కూడా సెమీస్ బరిలో నిలిచాయి.ఇక ఏ టీం సెమిస్ కి వెళ్తుంది అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గానే కొనసాగుతుంది…