Hybrid pitch : వర్థమాన క్రికెట్ లో హైబ్రిడ్ మైదానాల ప్రస్తావన కొత్త కాదు. కాకపోతే మనదేశంలోనే ఇటీవలి ఐపిఎల్ సీజన్ లో హైబ్రిడ్ మైదానాల ఏర్పాటు తెరపైకి వచ్చింది.. ఇటీవల ipl సీజన్ లో సింహభాగం మ్యాచ్ లలో 200కు పైగా స్కోర్లు నమోదు అయ్యాయి. 200+ టార్గెట్ కూడా నిలబడలేదు. ఈ క్రమంలో బౌలర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు భారీ స్కోర్ నమోదయింది. ఈ క్రమంలో ప్రఖ్యాత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా ” దేవుడా మా బౌలర్లను నువ్వే కాపాడు” అంటూ ట్వీట్ చేశాడు. అతడు చేసిన ఆ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దానిని అనేకమంది బౌలర్లు రీ ట్వీట్ చేశారు. దీంతో బీసీసీఐ పునరాలోచన చేసింది. మైదానాల కూర్పులో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు సహకరించేలా రూపొందించాలని భావించింది. ఇందులో భాగంగా వచ్చిన ఆలోచన హైబ్రిడ్ పిచ్. గత ఐపిఎల్ సీజన్లో ఏకంగా 30 ఇన్నింగ్స్ లలో 200+ స్కోర్లు, 12సార్లు 190-200 మధ్య రికార్డు స్కోర్లు నమోదయ్యాయి. హైదరాబాద్ జట్టు అయితే ఏకంగా రెండుసార్లు హైయెస్ట్ స్కోర్ నమోదు చేసింది. ముఖ్యంగా బెంగళూరుకు జట్టుతో జరిగిన మ్యాచ్లో అయితే హైదరాబాద్ జట్టు 287 స్కోర్ చేసింది. అయితే ఆ టార్గెట్ ను చేజ్ చేసే క్రమంలో బెంగళూరు 262 రన్స్ చేసింది. కోల్ కతా 223 రన్స్ చేస్తే.. రాజస్థాన్ జట్టు ఆ లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించింది. అయితే ఈ భారీ పరుగుల పోరులో బౌలర్లు పూర్తిగా డీలా పడిపోయారు. మైదానం నుంచి సరైన సహకారం లభించకపోవడంతోనే వారు ఇలా సరైన స్థాయిలో బంతులను సంధించలేకపోయారు.
మనదేశంలో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల క్రికెట్ స్టేడియంలో హైబ్రిడ్ పిచ్ రూపొందించారు. ఈ మైదానంలో రెండు మ్యాచ్ లు నిర్వహించారు. అయితే అనుకున్నట్టుగా బౌలర్లకు మైదానం నుంచి సహకారం లభించలేదు. కొంతమంది బౌలర్లు మాత్రం మైదానంపై బౌన్స్ రాబట్టారు. అయితే చివరికి ఇలాంటి హైబ్రిడ్ పిచ్ లపై కూడా బ్యాటర్లు పండగ చేసుకున్నారు. వాస్తవానికి క్రికెట్ లో బ్యాట్ కు మధ్య సమతూకం ఉంటేనే ఆటలో మజా ఉంటుంది. ఇందుకోసం సిస్ గ్రాస్ అనే సంస్థ హైబ్రిడ్ పిచ్ లను కొంతకాలంగా తయారుచేస్తోంది. అయితే ఇవి ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇలా రూపొందించే పిచ్ ట్రాక్ లలో సహడిసిద్ధంగా పెరిగిన గడ్డిని అమరుస్తారు. ఇందులో ఐదు శాతం పాలిమర్ కూడా ఏర్పాటు చేస్తారు. నీతో ఈ పిచ్ లు తాజాగా ఉంటాయి.. బౌలర్లు పటిష్టంగా బంతులను విసరవచ్చు. బౌన్స్ స్థిరంగా రాబట్టేందుకు అవకాశం ఉంటుంది.. ధర్మశాలలో మైదానాన్ని ఈ హైబ్రిడ్ పిచ్ తో రూపొందించారు. మరోవైపు ఇంగ్లాండ్ లో ఇప్పటికే హైబ్రిడ్ పిచ్ లు ఏర్పాటు చేశారు. బ్యాటర్ల కంటే బౌలర్లకు కాస్త మొగ్గు కనిపించడం విశేషం. ఇంగ్లాండ్లో కౌంటి మ్యాచ్ లు నిర్వహించే మైదానంలో కూడా హైబ్రిడ్ పిచ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టి20, వన్డే లలో హైబ్రిడ్ పిచ్ ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీంతో భారత్ లో కూడా హైబ్రిడ్ పిచ్ లు ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇతర దేశాలతో పోల్చితే భారత మైదానాలు పూర్తి విభిన్నమైనవి. పేస్, స్పిన్ కు సహకరిస్తాయి. బ్యాటర్లకు కూడా అనుకూలంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ కృత్రిమ మైదానాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న వ్యక్తమవుతోంది. అయితే ఈ మైదానాల ఏర్పాటుపై ఇంతవరకు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ఎటువంటి కామెంట్స్ చేయలేదు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Not workout in ipl but if hybrid pitch is set up in other stadiums will there be results
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com