India Vs Australia World Cup Final: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మీద ఆడిన ఫైనల్ మ్యాచ్ లో ఘోర పరాజయాన్ని చవిచూసింది.ఇక ఈ మ్యాచ్ కోసం 140 కోట్ల మంది జనాలు ఎదురు చూశారు. ఇండియన్ ప్లేయర్లు వరల్డ్ కప్ తీసుకుంటే కళ్ళతో చూడాలని కలలు కన్నారు, కానీ అది కలగానే మిగిలింది.ఇక లీగ్ లో వరుస విజయాలను అందుకున్న ఇండియన్ టీమ్ ఫైనల్ లో అలా ఓడిపోవడం ప్రతి ఒక్క భారతీయుడిని కలిచివేసింది.
నిజానికి చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక కొంతమంది అయితే హార్ట్ ఎటాక్ లు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియాలో క్రికెట్ అనేదానికి ఎంత ఎమోషన్ ఆడ్ అయి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక మన పరిస్థితి ఇలా ఉంటే గ్రౌండ్ మ్యాచ్ గెలుస్తుందని భావించి చివరి వరకు పోరాటం చేసిన మన ప్లేయర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.అయితే కోహ్లీ, రోహిత్, సిరాజ్, రాహుల్ లాంటి ప్లేయర్లు గ్రౌండ్ లో ఏడవడం మనం చూశాం…ఇక వాళ్ళు డ్రెస్సింగ్ రూమ్ లో వెళ్ళిన తర్వాత వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని అర్థం చేసుకున్న భారత ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి వాళ్ళతో మాట్లాడారు.
ముందుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి వాళ్ళ చేతిలో చేయి వేసి మ్యాచ్ లో గెలుపు ఓటములనేవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. మనం వాటిని పట్టించుకోకుండా పోరాడుతూ ముందుకు సాగడమే మన లక్షణం, మన లక్ష్యం అంటూ వాళ్లకి ధైర్యం చెప్పే మాటలు మాట్లాడాడు. ఇక ప్రతి ప్లేయర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వాళ్ళతో మాట్లాడారు. ముఖ్యంగా మహమ్మద్ షమీకి మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా హగ్ చేసుకుని బాగా బౌలింగ్ చేసావ్ అంటూ చెప్పడం విశేషం…ఇక ఇండియన్ టీం కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ ని ఎలా ఉన్నావ్ రాహుల్ అంటూ ఆయనతో కూడా మాట్లాడాడు. ఇలా ఒక ప్రధానమంత్రి అయి ఉండి ఓడిపోయిన ప్లేయర్ల దగ్గరకు వచ్చి వాళ్లకు ధైర్యం చెప్పడం చూసిన ప్రతి భారతీయ పౌరుడు కూడా మోడీ గారి వైఖరికి ఫిదా అవుతున్నారు.
అంటే గెలిచినప్పుడు చప్పట్లు కొట్టి అభినందించడమే కాదు ఓడిపోయినప్పుడు కూడా ఓదార్చే వాళ్ళు మనకు ఉన్నారు అని ప్లేయర్లకు చాటి చెప్పినందుకు మోడీ మీద అభిమానుల్లో భారీ ఎత్తున గౌరవానికి పెరిగింది…ఇక మొన్న జరిగిన ఈ సంభాషణని బీసీసీఐ రీసెంట్ గా వీడియో రూపంలో రిలీజ్ చేసింది.ఇక ఇది చూసిన ప్రతి అభిమాని కూడా మోడీ వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ ను చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు…