IPL playoffs: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయి. ఇక ఇప్పటి వరకు ఒక్క టీం కూడా ప్లే ఆఫ్ కి క్వాలిఫై కాకపోవడం బాధకరమైన విషయమనే చెప్పాలి. ఇక ప్రతి సీజన్ లో కూడా ఇప్పటి వరకు కనీసం ఒక్క జట్టు అయిన ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యేది. కానీ ఈసారి మాత్రం అన్ని టీములు దాదాపు 12 మ్యాచ్ లు ఆడినప్పటికీ ఒక్కటి కూడా ఇంకా ప్లే ఆఫ్ బెర్త్ లను కన్ఫర్మ్ చేసుకోలేదు.
ఇక ప్రస్తుతం కలకత్తా నైట్ రైడర్స్ టీం 11 మ్యాచులు ఆడితే అందులో 8 మ్యాచ్ ల్లో గెలిచి 16 పాయింట్ల తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ టీం కూడా 11 మ్యాచులు ఆడగా అందులో 8 మ్యాచ్ ల్లో విజయం సాధించి 16 పాయింట్లతో రెండో పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక కలకత్తా, రాజస్థాన్ రెండు టీమ్ లు కూడా 16 పాయింట్లు సాధించినప్పటికీ రన్ రేట్ రాజస్థాన్ కంటే కలకత్తా కి కొంచెం మెరుగ్గా ఉండడంతో ఆ టీం మొదటి ప్లేస్ ని కైవసం చేసుకుంది. ఇక ఇవాళ్ళ కలకత్తా టీం ముంబై ఇండియన్స్ టీం మీద ఆడే మ్యాచ్ లో విజయం సాధించినట్లయితే అఫీషియల్ గా కలకత్తా టీం ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవుతుంది…
ఇక రాజస్థాన్ రాయల్స్ టీం కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక ఈ రెండు టీంలు కూడా ప్లే ఆఫ్ కి చేరుకుంటాయని చెప్పడంలో సందేహం లేదు. కానీ మిగిలిన రెండు టీమ్ లు ఏవి అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇక నిన్న చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ టీమ్ మీద ఓడిపోవడంతో చెన్నై ప్లే ఆఫ్ కి చేరుకోవడం అనేది కొంచెం కష్టంగా మారింది. ఇక ఇప్పటికే హైదరాబాద్ టీమ్ 12 మ్యాచ్ లు ఆడితే అందులో 7 మ్యాచుల్లో విజయం సాధించి 14 పాయింట్లతో నెంబర్ 3 పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ నెక్స్ట్ గుజరాత్, పంజాబ్ టీమ్ లతో తలపడనుంది.కాబట్టి ఈ రెండు మ్యాచుల్లో ఏ ఒక్కటి గెలిచిన కూడా హైదరాబాద్ సెమిస్ కి క్వాలిఫై అవుతుంది. ఇక నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగాలంటే ఈ రెండు మ్యాచ్ లకు రెండు మ్యాచ్ లు గెలవాలి. అలాగే రాజస్థాన్, కలకత్తా టీమ్ లు ఓడిపోవాలి. అలాగైతే హైదరాబాద్ టీం మొదటి రెండు ప్లేస్ లలో ఏది ఒక ప్లేస్ ను దక్కించుకునే అవకాశం అయితే ఉంటుంది…
ఇక నెంబర్ 4 పొజిషన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జాయింట్స్ టీమ్ లు తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. చెన్నై టీమ్ 12 పాయింట్లతో నెంబర్ 4 పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక ఢిల్లీ, లక్నో 6 మ్యాచుల్లో గెలిచి 12 పాయింట్ల ను సంపాదించుకున్నప్పటికి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ వీటితో పోల్చుకుంటే రన్ రేట్ కొంచెం మెరుగ్గా ఉండటంతో చెన్నై నెంబర్ 4 పొజిషన్ లో కొనసాగుతుంది. ఇక ఇది ఇలా ఉంటే చెన్నై ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వాలంటే ఇప్పుడు జరగబోయే రెండు మ్యాచ్ ల్లో గెలవాల్సి ఉంది. ఇక చెన్నై రాజస్థాన్, బెంగళూరు లతో తలపడబోతుండగా ఈ రెండింటిలో ఏ ఒక్కటి ఓడిపోయిన కూడా చెన్నై ప్లే ఆఫ్ అనేది కష్టతరమవుతుంది. కాబట్టి ఈ రెండింటిలో రెండు మ్యాచ్ లు గెలిస్తేనే చెన్నై మరింత ముందంజలో సెమీస్ కి క్వాలిఫై అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఢిల్లీ లక్నో విషయానికి వస్తే చెన్నై క్వాలిఫై అవ్వకపోతే ఈ రెండు టీమ్ ల్లో ఏదో ఒకటి ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇక చివరి మ్యాచ్ లో ఈ రెండు తలపడబోతుండగా ఏది విజయం సాధిస్తే దానికి ప్లే ఆఫ్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక బెంగళూరు, గుజరాత్ జట్లకి అవకాశం ఉన్నప్పటికీ మిగతా టీం లా విజయాలను బేస్ చేసుకొని వాళ్లకు అవకాశం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఒక రకంగా చెప్పాలంటే వీళ్లు ప్లే ఆఫ్ కి వెళ్లడం చాలా కష్టతరం అనే చెప్పాలి… మరి ప్లే ఆఫ్ కి చేరుకునే ఆ నాలుగు టీమ్ లు ఏవో తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే…