Odi World Cup 2023: అక్టోబర్ 5వ తారీఖు నుంచి భారత్ ఆతిథ్యంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుతం ఆసియా కప్‌కు ప్రకటించిన 17 మంది లో ప్రసిద్ద్ కృష్ణ, తిలక్ వర్మలను పక్కన పెట్టి మిగిలిన 15 మంది సభ్యులను మండే ప్రపంచ కప్ టీం కోసం ఎంపిక చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి.
కొంతమంది టీం వివరాలతో హ్యాపీగా ఉంటే ,మరి కొంతమంది ఇలాంటి జట్టుతో వరల్డ్ కప్ గెలవాలి అని ఎలా అనుకుంటున్నారు ..?అంటూ ప్రశ్నిస్తున్నారు. మిగిలిన అన్ని దేశాల జట్లు.. యువర్ ప్లేయర్స్ తో పాటు అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఆటగాళ్లకు పెద్ద పీట వేస్తున్నారు . కానీ పిసిసిఐ మాత్రం ఏకపక్ష నిర్ణయి తలా తోకా లేకుండా వ్యవహరిస్తున్నట్టు క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఏంటి ఎంతో ముఖ్యమైనటువంటి సీనియర్లపై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.
టీమిండియాలో శిఖర్ ధావన్, అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ లాంటి వెటరన్ ప్లేయర్స్ ను పక్కన పెట్టేయడం ఆశ్చర్యంగా ఉంది. వన్డే ప్రపంచ కప్ కు తీసుకో లేదు అంటే.. ఇక ఈ నలుగురు ఆటగాళ్ల కెరీర్ దాదాపుగా ముగిసినట్లే అని క్రికెట్ విశ్లేషకుల భావన. ఒకప్పుడు ఓపెనర్‌గా వ్యవహరించిన శిఖర్ ధావన్…మెరుగైన ప్రదర్శన కనబరచడమే కాకుండా టీమిండియా స్కోర్ ను శిఖరాలకు చేర్చాడు. అద్భుతమైన విజయాలు అందించిన బీసీసీఐ ఆసియా కప్‌లో అతన్ని పక్కన పెట్టేసింది. ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా ప్లేస్ ఇవ్వకుండా తీవ్రమైన నిరాశ మిగిల్చింది.
దానికి తోడు ప్రస్తుతం తన దృష్టిలో ఓపెనర్స్ అంటే రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్ మాత్రమే అని.. ధావన్ ఒకప్పటి ఓపెనర్ అని గతంలో అగార్కర్ చేసిన కీలక కామెంట్స్.. ఇప్పుడు అతని సైలెంట్ గా పక్కన పెట్టేసిన తీరు..ధావన్ కెరీర్ ముగిసినట్టేనని అనుమానం కలిగిస్తున్నాయి.
మరో పక్క కుల్దీప్, అక్షర్ పటేల్ ప్లేస్ లో అశ్విన్ టీం లో ఉంటే.. జట్టుకి అవసరమైనప్పుడు అతను అనుభవం ఎంతో సహాయపడుతుంది. మరో పక్క భువనేశ్వర్ స్వింగ్ అండ్ పవర్ ప్లే క్లిష్టమైన ఆట సమయాలలో జట్టుని విజయం వైపు నడిపిస్తుంది. ఇలాంటి సీనియర్ బౌలర్లను పక్కన పెట్టడంపై సెలక్షన్ కమిటీ వ్యవహారం ఎంత ఏకపక్షంగా ఉందో అన్న వాదన వినిపిస్తోంది. గత కొద్ది కాలంగా ఎక్కడా అసలు చాలు ఊసే లేదు…ఐసీసీ టోర్నమెంట్లలోనూ చాహల్‌ను బీసీసీఐ పక్కన పెట్టడం ఇప్పుడు తుది చెట్టులో అతనికి ప్లేస్ దొరక్క పోవడం అతని కెరియర్ పై కూడా సందేహాలను రేపుతోంది.