Dravid Warner: ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ వార్నర్ మాట్లాడాడు. ఈ సందర్భంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. కెప్టెన్ పాట్ కమిన్స్( pat cummins) చీల మండ గాయంతో బాధపడుతున్నాడు. అతడు శ్రీలంక టోర్నీకి దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ (Steve Smith) కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే జరిగిన తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండవ టెస్టులోనూ విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఇక మరో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ వన్డే ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఆతడు ఇటీవల మ్యాచ్ ఆడుతూ గాయపడ్డాడు. దీంతో ఏకంగా వన్డే ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు.. జోష్ హేజిల్ వుడ్, మార్ష్ కూడా గాయాల బారినపడటంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. అయితే కీలక ఆటగాళ్లు గాయాల వల్ల ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కావడంతో.. ఆస్ట్రేలియా జట్టు ఆట తీరుపై చర్చ మొదలైంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి అన్ని జట్లు పకడ్బందీ ప్రణాళికతో ప్రణాళికతో రంగంలోకి దిగాయి. అయితే ఆస్ట్రేలియా జట్టు మాత్రం కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ఇబ్బంది పడుతోంది.
అయినప్పటికీ కప్ ఆస్ట్రేలియాదే!
కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డప్పటికీ.. ఇతర సమస్యలు వేధిస్తున్నప్పటికీ చాంపియన్స్ ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టు మాత్రమే గెలుచుకుంటుందని.. ఆ జట్టు మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డాడు. ” ఐసీసీ మెగా టోర్నీల సమయంలో ఆస్ట్రేలియా కలసికట్టుగా ఆడుతుంది. సమష్ఠితత్వమే ఆస్ట్రేలియా బలం. ఆ జట్టు ఆటగాళ్లు కూడా 100 శాతానికి మించి ప్రదర్శన ఇస్తారు. అందువల్లే మెగా ట్రోఫీలను ఆస్ట్రేలియా గెలుచుకుంటుంది. వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. టి20 వరల్డ్ కప్ లో ప్రణాళికలు బెడిసి కొట్టినప్పటికీ.. అంతిమంగా ఆస్ట్రేలియా నే ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకునే అర్హత జాబితాలో ఉంది. చాలా జట్ల ఆటగాళ్లు ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేస్తారు. కానీ అది ముమ్మాటికి తప్పు.. ఆస్ట్రేలియా జట్టు వద్ద అనేక ఆస్త్రాలు ఉంటాయి. వాటిని సరైన సమయంలోనే ఆ జట్టు బయటికి తీస్తుంది. ఫలితాలను తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో జరిగింది అదే. భారత్ వేదికగా ఆ మ్యాచ్ జరిగినప్పుడు.. ఆస్ట్రేలియా జట్టు సమష్టి తత్వాన్ని ప్రదర్శించి విజేతగా నిలిచిందనే విషయాన్ని మరవద్దని” డేవిడ్ వార్నర్ గుర్తు చేశాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ కు మనదేశంలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. పుష్ప, బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాల్లో దృశ్యాలకు రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా డేవిడ్ వార్నర్ మరింత దగ్గరయ్యాడు.