Nithish Kumar : కానీ ఐపీఎల్ చరిత్రలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టుకు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్లో అతడు అదరగొట్టాడు. సూపర్ మాన్ తరహాలో బ్యాటింగ్ చేశాడు. కానీ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో ఆడ లేకపోతున్నాడు. జట్టు యాజమాన్యం పెంచుకున్న ఆశలను అందుకోలేకపోతున్నాడు. దీంతో అతనిపై విమర్శలు పెరిగిపోతున్నాయి. అతడు తన ఆట తీరు మార్చుకోవాలని.. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాలని సలహాలు ఎక్కువవుతున్నాయి. ఈ దశలో నితీష్ కుమార్ రెడ్డి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు..
తండ్రి జెర్సీ మార్చేశాడు
హైదరాబాద్ జట్టు ప్రస్తుత ఐపీఎల్లో సంకట స్థితిలో ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్ చేరుకోవాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాలి. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్ల వ్యత్యాసంతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు శుక్రవారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్ జట్టుది. అందువల్లే హైదరాబాద్ ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇక తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అయితే తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ సమయంలో కొడుకుకు అండగా ఉండి.. గొప్ప ఇన్నింగ్స్ ఆడే విధంగా తోడ్పడాల్సిన.. అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించాడు. హైదరాబాద్ జట్టు జెర్సీ కాకుండా.. బెంగళూరు జట్టు జెర్సీ ధరించి.. విరాట్ కోహ్లీకి మద్దతు పలికాడని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. “నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి గతంలో బెంగళూరు జట్టుకు అభిమానిగా ఉండేవాడు. విరాట్ కోహ్లీకి అతడు వీరాభిమాని. అందువల్లే బెంగళూరు జట్టుకు సపోర్ట్ చేస్తున్నాడని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. మరికొందరేమో నితీష్ కుమార్ రెడ్డి దారుణంగా విఫలమవుతున్న నేపథ్యంలో.. తన కొడుకు దారుణమైన ఆట తీరు చూడలేక ముత్యాల రెడ్డి బెంగళూరు జట్టుకు సపోర్ట్ చేస్తున్నాడని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి కేవలం 152 పరుగులు మాత్రమే చేశాడు.. ఇంతవరకు అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదంటే అతడి బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గుజరాత్ జట్టుతో జరిగే మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి తన పూర్వపు లయ అందుకోవాలని అభిమానులు కోరుతున్నారు.. ఇప్పటికే హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ నితీష్ కుమార్ రెడ్డికి ఎన్నో అవకాశాలు ఇచ్చిందని.. ఇప్పటికైనా నితీష్ కుమార్ రెడ్డి ఆటతో అదరగొట్టాలని పేర్కొంటున్నారు.
Also Read :