Nita Ambani Comments On Rohit Sharma: రోహిత్ శర్మ పరిచయం అవసరం లేదు. టీమిండియా టీ20, చాంపియన్స్ ట్రోఫీలు అందించిన ఘనత అతడి సొంతం. టీమిండియాను వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ చాంపియన్ ఫైనల్స్ తీసుకెళ్లిన చరిత అతడికి ఉంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపాడు.
Also Read: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ముహూర్తం ఫిక్స్ చేసిన కవిత
క్రికెట్ లో విజయాలకు మాత్రమే ప్రయారిటీ ఉంటుంది. దానికి రోహిత్ మినహాయింపుకాదు. ఐపీఎల్ లో ముంబైని విజేతగా నిలిపినప్పటికీ మెనేజ్మెంట్ అతడిని 2024 సీజన్ లో సాధారణ ఆటగాడి స్థానానికే పరిమితం చేసింది. హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
రోహిత్ జట్టు కెప్టెన్ బాధ్యతలకు దూరమైనప్పటికీ ఆటగాడిగా అతడు ఎన్నడూ విఫలం కాలేదు. తనమీద ఉన్న అంచనాలను ఎప్పుడూ తక్కువ చేసుకోలేదు. అందుకే రోహిత్ ను చాలా మంది అభిమానిస్తుంటారు. రోహిత్ ఐపీఎల్ లోనే కాదు.. టీమిండియాలోనూ అవమానాలు ఎదుర్కొన్నాడు. టీ 20 వరల్డ్ కప్ అందించిన తర్వాత ఆ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. గంభీర్ కోచ్ అయిన తర్వాత రోహిత్ ను పొమ్మన లేక పొగపెట్టే కార్యక్రమం మొదలైంది.
టెస్ట్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆ ఫార్మాట్ నుంచి అతడు తప్పుకున్నాడు.దీంతో గిల్ కు అవకాశం కల్పించారు. వన్డే ఫార్మాట్ నుంచి కూడా రోహిత్ సారథి స్థానం నుంచి వైదొలిగాడు. ఆ స్థానం కూడా గిల్ తో భర్తీ చేశారు. వన్డే ఫార్మాట్ లో రోహిత్ సాధారణ ఆటగాడిగానే ఉన్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై జట్టులో ఆడుతున్న రోహిత్ మైదానంలో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. వాంఖడే స్టేడియంలో ముంబై ప్లేయర్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మను చూసిన ముంబై ఓనర్ నీతా అంబానీ ఆశ్చర్యపోయింది. ‘రోహిత్ ఇలా అయిపోయావేంటి? నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. మొత్తానికి పూర్తిగా మారిపోయావు. స్లిమ్ బాయ్ లా అయిపోయావు. యంగ్ లాగా కనిపిస్తున్నావంటూ’ నీతా కామెంట్ చేసింది. రోహిత్ ను ఉద్దేశించి నీతా అలా కామెంట్లు చేస్తుంటూ మిగతా ప్లేయర్లు నవ్వులు చిందించారు.