Homeక్రీడలుNew zealand Vs South Africa: 92 సంవత్సరాల నిరీక్షణకు తెర.. టెస్ట్ క్రికెట్లో న్యూజిలాండ్...

New zealand Vs South Africa: 92 సంవత్సరాల నిరీక్షణకు తెర.. టెస్ట్ క్రికెట్లో న్యూజిలాండ్ సంచలనం

New zealand Vs South Africa: 92 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెరపడింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో సంచలనం నమోదయింది. వెస్టిండీస్ జట్టు కంగారులపై 30 సంవత్సరాల తర్వాత గబ్బా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రికార్డు స్థాయిలో సాధించిన విజయాన్ని అభిమానులు మర్చిపోకముందే.. మరో సంచలనం నమోదయింది. నిలకడైన ఆటకు మారుపేరైన న్యూజిలాండ్ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. తమ దేశంలో సఫారీలతో జరుగుతున్న రెండవ టెస్టులో ఘన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా 92 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు శుభం కార్డు వేసింది. ఇప్పటికే మొదటి టెస్ట్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు.. రెండవ టెస్టునూ 7 వికెట్ల తేడాతో కైవసం చేసుకుంది. మాజీ కెప్టెన్ విలియమ్సన్ 133 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ సునాయాసంగా విజయం సాధించింది.

మొదటి టెస్టులో పరాజయం పాలైన సఫారీ జట్టు.. రెండవ టెస్టులో ధాటిగా ఆడింది. మొదటి, రెండు ఇన్నింగ్స్ లో బలంగా బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ జట్టు ఎదుట 267 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్ల మీద ఎదురుదాడికి దిగింది. విల్ యంగ్ 60 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మాజీ కెప్టెన్ కేన్ విలియంసన్ 133 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2_0 తేడాతో న్యూజిలాండ్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ట్రోఫీ మాత్రమే కాదు దక్షిణాఫ్రికా జట్టుపై తొలి టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.

తొలి టెస్ట్ లో సఫారీ జట్టు ఎటువంటి ప్రతిఘటన లేకుండానే న్యూజిలాండ్ ముందు చేతులెత్తేసింది. యంగ్ స్టార్ డేవిడ్ బడింగమ్ 110 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. లేకుంటే సఫారీల పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. కివిస్ పేస్ బౌలర్ విలియం ఒరూర్కే ఐదు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా 235 పరుగులకు మాత్రమే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కివిస్ 53 పరుగుల వద్ద ఓపెనర్లను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రచిన్ రవీంద్రతో కలిసి కేన్ 50 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో రవీంద్ర అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత వీల్ యంగ్ తో కలిసి కెవిన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 32వ సెంచరీ పూర్తి చేశాడు.

ఈ సెంచరీ ద్వారా ఆస్ట్రేలియా స్టార్ బెటర్ స్టీవ్ స్మిత్ రికార్డు సమం చేశాడు. అంతేకాదు అతని కంటే తక్కువ ఇన్నింగ్స్ లో కెవిన్ ఈ ఘనత సాధించాడు. విలియమ్సన్ 32 సెంచరీలు సాధించేందుకు 172 ఇన్నింగ్స్ ల సహకారం తీసుకున్నాడు. స్మిత్ 174 ఇన్నింగ్స్ ల్లో 32 సెంచరీలు సాధించాడు. 92 సంవత్సరాల తర్వాత దక్షిణాఫ్రికా జట్టుపై టెస్ట్ సిరీస్ విజయం సాధించడంతో న్యూజిలాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version