Homeక్రీడలుPak Vs NZ T20: టాప్ 11 ప్లేయర్లు లేరు.. అయినా పాకిస్తాన్ ను న్యూజిలాండ్...

Pak Vs NZ T20: టాప్ 11 ప్లేయర్లు లేరు.. అయినా పాకిస్తాన్ ను న్యూజిలాండ్ కొట్టేసింది.. ఇది కదా ఆటలో దమ్మంటే..

Pak Vs NZ T20: విలియంసన్ లేడు. డేంజరస్ బౌల్ట్ దూరంగా ఉన్నాడు. కాన్వే సొంత దేశంలో రెస్ట్ తీసుకుంటున్నాడు. సౌతి t20 వరల్డ్ కప్ కు తర్ఫీదు పొందుతున్నాడు. ఫెర్గు సన్, రచిన్ రవీంద్ర, మిచెల్, ఫిలిప్స్ ఐపీఎల్ లో ఆడుతున్నారు. శాంట్నర్ వ్యక్తిగత పని మీద ఉన్నాడు. సో మొత్తానికి న్యూజిలాండ్ కీలక జట్టనేది లేదు. సాధారణంగా కీలక ఆటగాళ్లు లేకుండా ఇతర దేశాలు, అది కూడా బలవంతమైన దేశం మీద క్రికెట్ ఆడాలంటే ఏ జట్టైనా ఆలోచిస్తుంది. అవకాశం లేకుంటే ప్లే 11 లో తక్కువలో తక్కువ ఒక ఆరుగురు సీనియర్ ఆటగాళ్లను పంపిస్తుంది. కానీ, పాకిస్తాన్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ తన బీ టీం ను పంపించింది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఆటపై న్యూజిలాండ్ కు ఎంత నమ్మకమో..

ఇటీవల రావల్పిండిలో తొలి టి20 వర్షం వల్ల తుడిచి పెట్టుకుపోయింది. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ జట్టులో కసి పెరిగింది. ఫలితంగా మూడో టి20 లో న్యూజిలాండ్ ఆటగాళ్లు పాకిస్తాన్ పై వారి సొంత దేశంలో ఘనవిజయం సాధించారు. ఫలితంగా టి20 సిరీస్ 1-1 తేడాతో సమం చేశారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ 20 ఓవర్లలో ఆ నాలుగు వికెట్ల నష్టానికి 178 రన్స్ చేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో షాదాబ్ ఖాన్ (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆయువు 32, బాబర్ అజం 37, ఇర్ఫాన్ ఖాన్ 30 పరుగులతో సత్తా చాటారు. న్యూజిలాండ్ బౌలర్లలో సోది రెండు, బ్రేస్ వెల్, డఫీ చెరో వికెట్ పడగొట్టారు.

179 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు 18.2 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ముద్దాడింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో మార్క్ చాప్ మన్ తుఫాన్ లాంటి ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. వారి బౌలింగ్ ను తునా తునకలు చేశాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 87 రన్స్ చేశాడు. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పాకిస్తాన్ బౌలర్లలో అబ్బాస్ ఆఫ్రిది రెండు, నసీమ్ షా ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ రెండు జట్ల మధ్య నాలుగో టి20 ఏప్రిల్ 25న జరుగుతుంది.

బీ టీం తో విజయం సాధించడం పట్ల న్యూజిలాండ్ జట్టుపై ప్రశంసలు వ్యక్తం అవుతుంటే.. పాకిస్తాన్ జట్టుపై విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత గడ్డపై బ్యాటింగ్ చేసే క్రమంలో పాకిస్తాన్ జట్టు తడబాటుకు గురవుతోందని.. కనీసం న్యూజిలాండ్ ముందు 190 పరుగుల టార్గెట్ నైనా ఉంచాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తొలి మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయిందని.. లేకుంటే ఆ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ విజయం సాధించి సిరీస్ దక్కించుకునేదని వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్తాన్ జట్టు టి20 వరల్డ్ కప్ కు ముందు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడుతుందనుకున్నామని, కానీ, ఇలాగా తేలిపోతుందని భావించలేదని పాక్ అభిమానులు వాపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ జట్టు కీలక ఆటగాళ్ళను ఏకిపడేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular