https://oktelugu.com/

Lakshya: ‘లక్ష్య’ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ముఖ్య అతిథులు వీరే

Lakshya: టాలీవుడ్​ యంగ్​ హీరో నాగశౌర్య హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా లక్ష్య. ఆర్చరీ బ్యాక్​డ్రాప్​లో ఈ సినిమా రూపొందుతోంది. సంతోష్​ జాగర్ల పూడి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో రొమాంటిక్​ ఫేమ్ హీరోయిన్​ కేరిత శర్మ నటించనుంది. కాగా, ఈ సినిమాతోనే సంతోష్​ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రీడా, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 01:54 PM IST
    Follow us on

    Lakshya: టాలీవుడ్​ యంగ్​ హీరో నాగశౌర్య హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా లక్ష్య. ఆర్చరీ బ్యాక్​డ్రాప్​లో ఈ సినిమా రూపొందుతోంది. సంతోష్​ జాగర్ల పూడి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో రొమాంటిక్​ ఫేమ్ హీరోయిన్​ కేరిత శర్మ నటించనుంది. కాగా, ఈ సినిమాతోనే సంతోష్​ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం కానున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రీడా, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.  డిసెంబరు 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

    Lakshya

    Also Read: ధోనితో బ్రేకప్ గురించి ఓపెన్ అయిన నటి రాయ్ లక్ష్మి…

    ఈ ఈవెంట్​లో ముఖ్య అతిథులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, శిక్షకుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ హాజరు కానున్నారు.  యంగ్ హీరో శర్వానంద్ తో పాటు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ వేడుకలో అతిథిగా హాజరుకానున్నారు.

    ఈ సినిమా కోసం విలువిద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు నాగ శౌర్య. ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని కొత్త లుక్​లో ఈ సినిమాలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాదు, ఇందులో రెండు విభిన్న పాత్రల్లో నాగశౌర్య అలరించనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాలో జగపతిబాబు, సచిన్ ఖేద్కర్ కీలక పాత్రలు పోషించారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10న విడుదలకు సిద్ధం చేశారు మేకర్స్​.

    Also Read: నాగశౌర్య “లక్ష్య” సినిమా నుంచి “సాయా సాయా” సాంగ్ రిలీజ్…