IPL 2024: క్రికెట్ పండుగకు సర్వం సిద్ధమైంది. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి చెన్నై ముస్తాబయింది. ఆరంభ మ్యాచ్ బెంగళూరు, చెన్నై జట్ల మధ్య చిదంబరం మైదానం వేదికగా జరగనుంది. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. గత సీజన్లో విజేతగా నిలిచిన చెన్నై జట్టుపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్లో బెంగళూరు జట్టు కప్ సాధించిన నేపథ్యంలో.. పురుషుల జట్టు కూడా అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఏటికేడు ఐపీఎల్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. బీసీసీఐ ఈసారి సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలు అంపైర్, బౌలర్లకు అనుకూలంగా ఉంటే.. బ్యాటర్లకు మాత్రం చుక్కలు చూపించేలా ఉన్నాయి.
Smart reply system (స్మార్ట్ రిప్లై సిస్టం)
Decision review system DRS లో లోపాలను సవరించేందుకు ఈ ఏడాది ఐపీఎల్ లో స్మార్ట్ రిప్లై సిస్టం(SRS) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానం వల్ల థర్డ్ ఎంపైర్ నిర్ణయం మరింత స్పష్టంగా ఉండనుంది. దీనికోసం మైదానంలో 8 హాక్ – ఐ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా మైదానంలో అన్ని దృశ్యాలను చిత్రీకరిస్తారు. వీటి సహాయంతో థర్డ్ ఎంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈ కెమెరాల సహాయంతో విభిన్న కోణాల నుంచి ఆటను థర్డ్ ఎంపైర్ వీక్షిస్తారు. స్ప్లిట్ స్క్రీన్ ద్వారా మ్యాచ్ మొత్తం థర్డ్ ఏం పేరు చూస్తారు. అవసరమైతే సిచువేషన్ స్క్రీన్ సహాయం కూడా తీసుకుంటారు. ఇది ఎలాగంటే.. మైదానంలో ఒక ఫీల్డర్ బౌండరీ గీత వద్ద క్యాచ్ పట్టుకుంటున్నాడనుకుందాం. ఈ సందర్భంలో ఫీల్డర్ కాలు బౌండరీ గీతను తగిలిందో లేదో గుర్తించేందుకు కాలు భాగం వీడియోను వెంటనే స్ప్లిట్ స్క్రీన్ ద్వారా ఎంక్వయిరీ చేయవచ్చు. అలాగే పాదంలో ఏ భాగం బౌండరీ గీతం తాకిందో కూడా తెలుసుకోవచ్చు.
(Bouncer rule)బౌన్సర్ నిబంధన
ఒక ఓవర్ లో బౌలర్లు ఒక బౌన్సర్ మాత్రమే వేయడానికి అవకాశం ఉండేది. కానీ ఈసారి దానిని మరో బౌన్సర్ కి పెంచారు. దీనివల్ల బౌలర్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో బౌలర్ రెండవ బౌన్సర్ వేస్తే, దానిని ఎంపైర్ నోబాల్ గా ప్రకటించేవాడు. గతంలో ఒకటే బౌన్సర్ వేసే అవకాశం ఉండడంతో బ్యాటర్లు మిగతా ఐదు బంతులను ఊచకోత కోసేవారు. కానీ ఈసారి ఆరు బంతుల్లో రెండు బౌన్సర్లు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. బ్యాటర్లకు చుక్కలు కనిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
No stop clock rule ( నో స్టాప్ క్లాక్ రూల్)
ఐసీసీ తీసుకొచ్చిన ఈ విధానాన్ని ఐపీఎల్ లో అమలు చేయడం లేదు. దాని ప్రకారం ఒక ఓవర్ పూర్తికాగానే థర్డ్ ఎంపైర్ టైమర్ ఆన్ చేస్తాడు. 60 సెకండ్ల లోపు బౌలింగ్ జట్టు వెంటనే మరో మొదలుపెట్టాలి. ఒకవేళ అలా చేయకుంటే ఫీల్డ్ ఎంపైర్ రెండుసార్లు హెచ్చరికలు జారీ చేస్తాడు. అయినప్పటికీ ఓవర్ వేయకుంటే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తాడు. అయితే టి20 ప్రపంచ కప్ నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.