Homeక్రీడలుTelangana T20 League: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. మనోడు పట్టిన ఈ క్యాచ్ అద్భుతం..అనన్యసామన్యం

Telangana T20 League: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. మనోడు పట్టిన ఈ క్యాచ్ అద్భుతం..అనన్యసామన్యం

Telangana T20 League: అది మామూలు క్యాచ్ కాదు. అమాంతం గాలిలో ఎగిరి సూపర్ మ్యాన్ లాగా అందుకున్నాడు. అదే సమయంలో తన శరీరాన్ని నియంత్రించుకున్నాడు.. బౌండరీ లైన్ కు సెంటీమీటర్ల దూరంలోనే ఆ క్యాచ్ అందుకొని అదరగొట్టాడు. ఈ అద్భుతం తెలంగాణ టి20 లీగ్ లో చోటుచేసుకుంది.

సాధారణంగా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన ఐపిఎల్ లేదా.. అంతర్జాతీయ మ్యాచ్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ తెలంగాణ టి20 లీగ్ లో అంతకు మించిన స్థాయిలో ఆటగాళ్లు ప్రదర్శన చేస్తున్నారు. ఈ టోర్నీ మీద అంచనాలు పెంచేస్తున్నారు.. ఈ టోర్నీలో వర్ధమాన ప్లేయర్లు ఎక్కువగా ఆడుతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పైగా ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్ ఏకపక్షంగా కాకుండా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. దీంతో చూసే ప్రేక్షకులకు నరాలు తెగే ఉత్కంఠ లభిస్తుంది.. సాధారణంగా ఇటువంటి అనుభవాన్ని ప్రేక్షకులు అంతర్జాతీయ లేదా ఐపీఎల్ లాంటి మ్యాచ్ల సందర్భంగా సొంతం చేసుకుంటారు. కానీ తెలంగాణ టి20 లీగ్ లో అంతకుమించిన క్రికెట్ మజా అభిమానులకు లభిస్తోంది.

ఆదివారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఖమ్మం, రంగారెడ్డి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జైస్వాల్ అనే క్రీడాకారుడు పట్టిన క్యాచ్ అత్యద్భుతమైన స్థాయిలో ఉంది. బ్యాటర్ కొట్టిన బంతి బౌండరీ వైపు లేచింది.. బౌండరీ లైనుకు సెంటీమీటర్ల దూరంలో ఉన్న జైస్వాల్ అమాంతం గాలిలోకి ఎగిరాడు. స్పైడర్ మాన్ మాదిరిగా క్యాచ్ అందుకున్నాడు. తనను తాను నియంత్రించుకొని.. బంతిని పట్టుకున్నాడు. దీంతో బ్యాటర్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియోను తెలంగాణ బిజెపి సి వి ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 1982లో క్రికెట్ లీగ్ ఆడటం మొదలు పెట్టిన నాటి నుంచి అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో ఇటువంటి మంచి క్యాచ్ ఎప్పుడూ చూడలేదని ఆనంద్ వ్యాఖ్యానించారు. జైస్వాల్ బౌండరీ లైన్ దాటకుండా.. తనను తాను నియంత్రించుకొని.. బంతిని అందుకున్న విధానం అద్భుతమంటూ సివి ఆనంద్ తన వ్యాఖ్యలను ఆ వీడియోకు జోడించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version