KL Rahul Captaincy: టీం ఇండియాను వరుస ఓటములు వెంటాడుతున్నాయి. రాహుల్ ద్రావిడ్ అండర్ -19 జట్టు కోచ్‌గా ఉన్న సమయంలో అన్ని విజయాలే. కానీ, భారత జట్టుకు ప్రధాన కోచ్ గా ఎంపిక అయ్యాక తొలిసారి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. ఆయన హెడ్ కోచ్ ఉన్నప్పటికీ కెప్టెన్సీ వివాదం టీం ఇండియాను చుట్టుముట్టడంతో జట్టుకు వరుసలు ఓటములు వెంటాడుతున్నాయి. కెప్టెన్సీ నుంచి కోహ్లీ వైదొలగడం, కెప్టెన్ రోహిత్ శర్మగాయంతో జట్టుకు దూరం అవడంతో పాటు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ సారధ్యంలో ఇండియా వరుస ఓటములను చవిచూస్తోంది. దీనికి ఐరన్ లెగ్ రాహుల్ కారణమని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన ఎక్కడ కెప్టెన్సీ చేసినా ఆ జట్టు వరుస ఓటములను చవిచూసిందని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
KL Rahul Captaincy
తాజాగా బొలాండ్ పార్క్‌లోని పార్ల్ వేదికగా జరిగిన వన్డే మ్యాచులో సౌతాఫ్రికా చేతిలో టీం ఇండియా ఘోర ఓటమి పాలైంది. దీనికి రాహుల్ కెప్టెన్సీ కారణమని కొందరు విమర్శిస్తున్నారు. టెస్ట్ సిరీస్‌లోనూ రెండో మ్యాచ్‌లో రాహుల్ జట్టును నడిపించాడు. తొలి టెస్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా ఆ మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న టీమిండియా రాహుల్ కెప్టెన్సీలో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. గతంలో ఐపీఎల్‌లోనూ పంజాబ్ కింగ్స్‌కు రాహుల్ నాయకత్వం వహించాడు. అక్కడ కూడా కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌ను రాహుల్ ఓటమితోనే ప్రారంభించాడు. దీంతో అభిమానులు రాహుల్‌ది ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. రాహుల్ కెప్టెన్సీలో గెలవడం సాధ్యం కాదని జోస్యం చెబుతున్నారు.
KL Rahul Captaincy
బ్యాటర్‌గా రాహుల్‌కు మంచి రికార్డులే ఉన్నాయి. మంచి ఓపెనర్‌గా ఆయా జట్లకు ఎక్కడా ఆడిన భారీగా పరుగులు చేశాడు. కానీ కెప్టెన్‌గా మాత్రం రాణించలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో అయితే బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ అదరగొట్టిన మ్యాచ్‌ల్లో కూడా కెప్టెన్‌గా పంజాబ్ జట్టును గెలిపించలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ జట్టును ఐపీఎల్‌లో ఒక్క సారి కూడా క్వాలిఫైయర్ రౌండ్‌లోకి తీసుకెళ్ల లేకపోయాడు.
Also Read: అందరి కళ్లు విరాట్ కోహ్లీపైనే.. ప్రతీకారం తీర్చుకుంటాడా..?
తాజాగా భారత జట్టుకు కూడా విజయాలను అందించలేకపోవడంతో రాహుల్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. దీంతో రాహుల్‌ది ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్సీని రాహుల్ మెయింటెన్ చేయలేకపోతున్నాడని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైదానంలో జట్టు ఆటగాళ్లను సరిగ్గా ఉపయోగించకోవడం లేదని సీనియర్లు మండిపడుతున్నారు. బౌలర్లు సరిగా వినియోంచుకోలోకపోయాడని విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read: ఆటో నడుపుకోవాలని హేళన చేశారు.. చేదు అనుభవంపై కన్నీళ్లు పెట్టుకున్న బౌలర్ సిరాజ్..