SRH Vs LSG: కేఎల్ రాహుల్ పై ఒంటి కాలుపై లేచిన లక్నో ఓనర్.. ఏకి పడేస్తున్న నెటిజన్లు

బుధవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో 166 రన్స్ చేసింది.. లక్నో జట్టులో ఆయుష్ బదోని 55, పూరన్ 48, రాహుల్ 29, కృణాల్ 24.. మాత్రమే రాణించారు. క్వింటన్ డికాక్, స్టోయినీస్ నిరాశపరిచారు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 9, 2024 8:16 am

SRH Vs LSG

Follow us on

SRH Vs LSG: ఆటను ఆటలాగే చూడాలి. అయితే విజయం, లేకుంటే పరాజయం. అంతేతప్ప ఆడిన ప్రతి మ్యాచ్ గెలవాలి అని అనుకోకూడదు. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. ఓటమి ఎదురైతే విజయాన్ని దక్కించుకోవాలి. విజయం దక్కితే దానిని మరింత సుస్థిరం చేసేందుకు అడుగులు వేయాలి. అంతేతప్ప పెట్టుబడి పెట్టాం, డబ్బులు ఇస్తున్నాం, కొనుగోలు చేసాం కాబట్టి, మాకు వారు పెంపుడు కుక్కలు, మేము వచ్చిన వెంటనే తోక ఊపాలి, ఆడిన ప్రతి మ్యాచ్ గెలవాలి అంటే కష్టమైపోతుంది.. క్రీడా స్ఫూర్తి దెబ్బతింటుంది.. ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతుంది.. బుధవారం హైదరాబాద్ తో ఓడిపోయిన తర్వాత లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు ఇలాంటి అనుభవం ఎదురయింది.. లక్నో జట్టు యజమాని కేఎల్ రాహుల్ పై ఒంటి కాలు మీద లేవడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బుధవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ బౌలర్లు కట్టదిట్టంగా బౌలింగ్ చేయడంతో 166 రన్స్ చేసింది.. లక్నో జట్టులో ఆయుష్ బదోని 55, పూరన్ 48, రాహుల్ 29, కృణాల్ 24.. మాత్రమే రాణించారు. క్వింటన్ డికాక్, స్టోయినీస్ నిరాశపరిచారు.. దీంతో లక్నో జట్టు నాలుగు వికెట్ల కోల్పోయి 167 రన్స్ చేసింది. హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ కమిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

167 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 9.4 లోనే చేదించింది. మరో 62 బంతులు మిగిలి ఉండగానే రికార్డు స్థాయిలో విజయాన్ని దక్కించుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఆట తీరు పట్ల ప్రశంసల జల్లు కురిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఓపెనర్లు హెడ్(89*; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లు), అభిషేక్ శర్మ (75*; 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్ లు) వీర విహారం చేయడంతో లక్నో బౌలర్లు చూస్తూ ఉండిపోయారు. అయితే ఫోర్, లేకుంటే సిక్స్ అన్నట్టుగా హైదరాబాద్ ఆటగాళ్ల బ్యాటింగ్ సాగడంతో స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది. లక్నో జట్టు విసిరిన స్కోర్ దూది పింజ కంటే తేలికైపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ భారీ విజయం హైదరాబాద్ జట్టుకు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచితే.. లక్నో జట్టుకు పీడకలను మిగిల్చింది.

ఈ దారుణమైన ఓటమి నేపథ్యంలో లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కే ఎల్ రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మైదానంలోకి వచ్చి రాహుల్ తో అత్యంత కోపంగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ద్వారా తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు సంజీవ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పాటలో ఓటమి సహజం. గెలుపైనా, ఓటమైనా ఒకే విధంగా తీసుకోవాలి. క్రికెట్ అంటే తెలియని వ్యక్తి ప్రొఫెషనల్ ఆటగాడికి క్లాస్ పీకడం ఏంటని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “కార్పొరేట్ వ్యక్తులను క్రికెట్ లోకి తీసుకొస్తే ఇలానే జరుగుతుందని.. ఇంతకుమించి ఏమీ చెప్పలేమని” వారు అంటున్నారు. కాగా, హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకున్న తర్వాత లక్నో ప్లే ఆఫ్ ఆశలను దాదాపుగా కోల్పోయింది.