RCB Vs RR 2024: అబ్బబ్బ.. ఏం కోపం.. ఎంతటి ఆవేదన.. ఎంతటి ఆవేశం.. మరెంతటి ఆక్రోశం.. ఇంత ఫ్రస్టేషన్ మనసులో గూడు కట్టుకొని ఉందా.. ఇంతటి ఆక్రందన దాగి ఉందా.. పొరపాటున విరాట్ కోహ్లీ ఇవి చూస్తే ఏమైనా ఉందా.. యాదృచ్ఛికంగా డూ ప్లెసిస్ కంటపడితే ఇంకేమైనా ఉందా.. ఒక్కొక్కరు ఒక్కో తీరు.. ఏకిపారేయడంలో ఏవైనా అవార్డులు పెడితే.. అవన్నీ వారికే దక్కుతాయి.. అలా ఉంది మరి వారు మీమ్స్ రూపొందించిన తీరు..
శనివారం రాత్రి రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు ఓటమిపాలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. బెంగళూరు జట్టును పెద్దగా కట్టడి చేయలేకపోయింది. సొంత మైదానం అయినప్పటికీ రాజస్థాన్ బౌలర్లు పదునైన బంతులు వేయలేకపోయారు. దీంతో బెంగళూరు జట్టు 20 ఓవర్లకు మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ, కెప్టెన్ డు ప్లెసిస్ అద్భుతంగా ఆడారు. తొలి వికెట్ కు 125 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఏకంగా 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి వికెట్ 125 పరుగుల వద్ద కోల్పోయిన బెంగళూరు.. మిగతా వికెట్లను వెంటవెంటనే నష్టపోయింది. చివరి వరకు కోహ్లీ క్రీజ్ లో ఉండడంతో.. బెంగళూరు 20 ఓవర్లకు 183 పరుగులు చేసింది.
అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 0 పరుగులకే యశస్వి జైస్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత కుదురుకుంది. సంజు సాంసన్, బట్లర్ వీరోచితంగా ఆడటంతో రెండో వికెట్ కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నమోదయింది.. బట్లర్ సెంచరీ పూర్తి చేశాడు. సంజు 69 పరుగులు చేశాడు. ఈ జోడిని విడదీసేందుకు బెంగళూరు కెప్టెన్ ఎంతమంది బౌలర్లతో బౌలింగ్ చేయించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో వరుసగా బెంగళూరు జట్టు హ్యాట్రిక్ ఓటములు నమోదు చేసింది. 183 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేక బెంగళూరు బౌలర్లు చేతులెత్తేశారు.
ఇక బెంగళూరు ఓడిపోయిన విధానాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారీ స్కోరు సాధించినప్పటికీ కూడా దానిని కాపాడుకోలేకపోవడం సరికాదు అంటూ విమర్శిస్తున్నారు. బహుళ ప్రజాదరణ పొందిన సినిమాలలోని సన్నివేశాలను మీమ్స్ రూపొందించి బెంగళూరు జట్టును ఏకిపారేస్తున్నారు. మహిళలు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కప్ దక్కించుకుంటే.. బెంగళూరు పురుష జట్టు పరువు తీస్తోందంటూ విమర్శిస్తున్నారు. ఇంతవరకు ఐపీఎల్ కప్ దక్కించుకోలేదని.. ఈసారైనా కప్ సాధిస్తారని అనుకుంటే చెత్త ప్రదర్శన చేస్తున్నారంటూ అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. మరి దీనిపై బెంగళూరు జట్టు ఆటగాళ్ల రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో.. వచ్చే మ్యాచ్లో అయినా గెలుస్తారో.. వేచి చూడాల్సి ఉంది.
View this post on Instagram