Gautam Gambhir deadline for team: మరో మూడు నెలల్లో భారత్, శ్రీలంక సంయుక్తంగా టి20 వరల్డ్ కప్ నిర్వహించబోతున్నాయి. ఈ టోర్నీకి సంబంధించి టీమిండియా సన్నాహాలు మొదలుపెట్టింది. కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా ప్లేయర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
బిసిసిఐ పోస్ట్ చేసిన వీడియోలో గౌతమ్ గంభీర్ ఆటగాళ్లతో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. మైదానంలో ఉన్న ఆయన బ్యాటింగ్ ఎలా చేయాలో.. ప్రత్యర్థి బ్యాటర్లకు బంతులను ఏ విధంగా సంధించాలో ఆటగాళ్లకు చూపిస్తున్నారు.. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మరో మూడు నెలల్లో టీమిండియా టి20 వరల్డ్ కప్ ఆడబోతోంది. ఈసారి టైటిల్ ఫేవరెట్ గా టీమ్ ఇండియా బరిలోకి దిగబోతోంది. 2024 లో టీమిండియా ఛాంపియన్ అయింది. 2007లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. 17 సంవత్సరాల అనంతరం భారత్ మళ్ళి ఛాంపియన్ అయింది. ఈ నేపథ్యంలో 2026లో కూడా ట్రోఫీ అందుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పటిష్టమైన కసరత్తు చేయాలని గౌతమ్ గంభీర్ ప్లేయర్లకు సూచిస్తున్నాడు.
“మరో మూడు నెలల్లో టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ ట్రోఫీకి ఆటగాళ్లు పూర్తిస్థాయి సిద్ధం కావాలి. ప్రత్యర్థి ప్లేయర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఆటతీరు కొనసాగించాలి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో జరిగే టీ 20 మ్యాచ్ ల సిరీస్ లను సద్వినియోగం చేసుకోవాలని” గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా ప్లేయర్లకు సూచించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
2024 t20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. టి20 విధానంలో జరిగిన ఆసియా కప్ కూడా సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టి20 సిరీస్ ను కూడా టీమిండియా గెలిచింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరిగే టి20 వరల్డ్ కప్ లో సత్తా చూపించి.. మరోసారి ట్రోఫీ అందుకోవాలని టీమ్ ఇండియా దృఢ నిశ్చయంతో ఉంది.
. .
Get inside the mind of #TeamIndia Head Coach @GautamGambhir as he shares his vision in ’ .
Stay tuned for the full exclusive interview ⏳ pic.twitter.com/nmvG9x2YUW
— BCCI (@BCCI) November 10, 2025