Mumbai Vs Punjab Vijay Hazare Trophy: అంతర్గత రక్తస్రావం వల్ల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సిరీస్ లో అర్ధాంతరంగా శ్రేయస్ అయ్యర్ (shreys iyer) మైదానం నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడిని అత్యవసర వైద్య విభాగంలో చేర్పించారు. దాదాపు రెండు నెలలపాటు అతడు ఆస్పత్రిలోనే చికిత్స పొందాడు. చివరికి కోలుకున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో అబ్జర్వేషన్ లో ఉన్నాడు.
చివరికి అతడు అంచనాలను అందుకోవడంలో సఫలం కావడంతో.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అతడికి ఎన్వోసీ మంజూరు చేసింది. దీంతో న్యూజిలాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కు మార్గం సుగమం అయింది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఐదు టీ 20 మ్యాచ్ ల సిరీస్ కూడా ఆడుతుంది.
జట్టులోకి రావడంతో అయ్యర్ ఆనందంతో గంతులు వేస్తున్నాడు. అయితే అతడికి ఊహించని షాక్ తగిలింది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం పంజాబ్ జట్టుతో ముంబై ఆడింది. ముంబై జట్టు తరఫున అయ్యర్ ఆడాడు. ఈ నేపథ్యంలో ఒక్క పరుగు తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆధ్వర్యంలోని పంజాబ్ జట్టు పై చేయి సాధించింది. దీంతో దీంతో అయ్యర్ జట్టుకు నిరాశ మిగిలింది.
జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు టాస్ ఓడిపోయింది . ముంబై జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ముంబై బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో పంజాబ్ ప్లేయర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అభిషేక్ శర్మ (8), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (11), హర్నూర్ సింగ్(0) వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఈ దశలో అన్మోల్ ప్రీత్ సింగ్ (57) సమర్థవంతంగా బ్యాటింగ్ చేశాడు. అతడికి నమన్ (22) సహకారం అందించాడు. రమన్ దీప్ సింగ్(72), బ్రార్(15), సుఖదీప్ (17) సమర్థవంతంగా బ్యాటింగ్ చేయడంతో పంజాబ్ జట్టు 45.1 ఓవర్లలో 216 పరుగులు చేసింది.
ఆ తర్వాత ముంబై జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది. రఘు వంశీ (23), ముషీర్ ఖాన్ (21) సత్తా చూపించారు. సర్ఫ రాజ్(20 బంతుల్లో 62) అదరగొట్టాడు. ఆ తర్వాత అయ్యర్ (34 బంతుల్లో 45) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. అయ్యర్ అవుట్ అయిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ (15) దారుణంగా విఫలమయ్యాడు. శివం దుబే (12), హార్దిక్ థామూర్ (15) నిరాశపరిచారు. సాయి రాజు పాటిల్ (2), శశాంక్ (0), ఓంకార్ (0) చేతులెత్తేయడంతో ముంబై జట్టు ఓటమిపాలైంది.
పంజాబ్ జట్టు బౌలర్ల దూకుడుకు ముంబై జట్టు 26.2 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది.. దీంతో పంజాబ్ జట్టు ఒక్క పరుగుతో విజయం సాధించింది. పంజాబ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, పేస్ బౌలర్ బ్రార్ చెరి నాలుగు వికెట్లు దక్కించుకున్నారు.