IPL Auction MI : ముంబై ప్లాన్ మామూలుగా లేదు; ఈసారి ఐపీఎల్ కప్ కొట్టేలా ఉంది

IPL Auction MI : ఐపీఎల్ సీజన్ల లో ఐదుసార్లు కప్ గెలిచిన చరిత్ర ముంబై ఇండియన్స్ ది. ఆ జట్టులో అరి వీర భయంకరమైన ఆటగాళ్లు ఉన్నారు. పైగా ఆ జట్టును రిలయన్స్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో డబ్బులకు ఏ లోటూ లేదు.. పైగా ప్రపంచ శ్రేణి ఆటగాళ్ళను కొనుగోలు చేయడంలో ఆ టీం మేనేజ్మెంట్ తీరే వేరు.. అయితే గత ఏడాది ఈ జట్టు అత్యంత చెత్తగా ఆడింది.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.. […]

Written By: K.R, Updated On : December 24, 2022 9:51 pm
Follow us on

IPL Auction MI : ఐపీఎల్ సీజన్ల లో ఐదుసార్లు కప్ గెలిచిన చరిత్ర ముంబై ఇండియన్స్ ది. ఆ జట్టులో అరి వీర భయంకరమైన ఆటగాళ్లు ఉన్నారు. పైగా ఆ జట్టును రిలయన్స్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో డబ్బులకు ఏ లోటూ లేదు.. పైగా ప్రపంచ శ్రేణి ఆటగాళ్ళను కొనుగోలు చేయడంలో ఆ టీం మేనేజ్మెంట్ తీరే వేరు.. అయితే గత ఏడాది ఈ జట్టు అత్యంత చెత్తగా ఆడింది.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.. జట్టులో మార్పులు చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అప్పట్లో మేనేజ్మెంట్ ప్రేక్షకులకు సర్ది చెప్పుకుంది.. అదే సమయంలో తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి వారు తమను తాము నిరూపించుకున్నారు..

 

అతడి స్థానం భర్తీ చేసే వారెవరు?

అయితే ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముంబై ముందు పెద్ద సవాల్ నిలిచింది.. అదేంటంటే లెజెండరీ ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ స్థానాన్ని భర్తీ చేయడం.  ఈ వేలానికి ముందే పొలార్డ్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అయితే ముంబై జట్టు బ్యాటింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అతడి స్థానాన్ని భర్తీ చేయగలిగే ఆటగాడిని కొనుగోలు చేయడం ముంబై జట్టు మందు పెద్ద సవాల్ గా నిలిచింది.. అయితే ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ ను ముంబై జట్టు కొనుగోలు చేసింది. అతని కోసం ఏకంగా 17.5 కోట్లు ఖర్చు చేసింది. ఇతడితో పొలార్డ్ స్థానం భర్తీ చేయాలి అనేది ముంబై ప్లాన్.

వేలానికి ముందే..

ఐపీఎల్ వేలానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్ళను రిటైన్ చేసుకుంది.. తిలక్ వర్మ, డేవిడ్, బ్రేవిస్ వంటి వారిని అట్టిపెట్టుకుంది.. అంతేకాదు ఐపీఎల్ స్కౌటింగ్ టీమ్స్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది.. కొందరు అత్యుత్తమ యువ ఆటగాళ్లు వీళ్ళ కారణంగానే ప్రపంచానికి తెలిశారు.. దీంతోపాటు సౌత్ ఆఫ్రికా యువ సంచలనం డువాన్ జాన్సెన్ ను ముంబై జట్టు కొనుగోలు చేసింది.

ఈసారి విభిన్నంగా

ముంబై జట్టు గత ఏడాది జరిగిన పొరపాటును ఈసారి పునరావృతం చేయకుండా బ్యాలెన్స్ గా కనిపిస్తోంది.. రోహిత్, సూర్య, ఇషాన్ వంటి బడా ఆటగాళ్లతో పాటు తిలక్ వర్మ, బ్రేవిస్, డేవిడ్ వంటి యువ ఆటగాళ్లు కూడా ఇటీవల కాలంలో సత్తా చాటుతున్నారు..వీరు కలసికట్టుగా రాణిస్తే వచ్చే ఏడాది ముంబై ట్రోఫీ గెలవడం ఖాయం.