Rohit Sharma: ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీం పరిస్థితి చాలా దారుణంగా తయారయింది. రోహిత్ శర్మ ని కెప్టెన్ గా తప్పిస్తూ ముంబై ఇండియన్స్ టీమ్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక అతని ప్లేస్ లో హార్దిక్ పాండ్య ని కొత్త కెప్టెన్ గా నియమించింది. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ రోహిత్ అభిమానులు మాత్రం ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత సడన్ గా రోహిత్ శర్మ ని తీసేయడం అనేది కరెక్ట్ కాదు అనే విషయం మీద ముంబై యాజమాన్యం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఐదుసార్లు ఐపిఎల్ ట్రోఫీ ని, అలాగే ఒకసారి ఛాంపియన్ ట్రోఫీని కూడా అందించి తన సత్తా ఏంటో చూపించి ఎక్కడో ఉన్న ముంబై టీమ్ ని టాప్ లోకి తీసుకువచ్చాడు. అలాంటి రోహిత్ శర్మ కి భారీ అవమానం జరిగింది అంటూ వాళ్ళు సోషల్ మీడియా వేదిక గా స్పందిస్తున్నారు…
ఇక రోహిత్ శర్మ ని కెప్టెన్ గా తీసేయడం వల్ల ముంబై ఇండియన్స్ టీమ్ కి జరిగిన నష్టం ఏంటి అంటే సోషల్ మీడియాలో ఇప్పటికే 8 లక్షల మంది ముంబై ఇండియన్స్ టీం ని అన్ ఫాలో చేశారు. రోహిత్ శర్మని కెప్టెన్ గా తీసివేస్తున్నాము అని అనౌన్స్ మెంట్ చేయకముందు ఇన్ స్టా లో ముంబై ఇండియన్స్ అభిమానులు 13.3 మిలియన్లు గా ఉన్నారు. కానీ ఒకసారి అనౌన్స్ మెంట్ చేసిన తర్వాత 24 అవర్స్ లోనే ఫాలోవర్స్ సంఖ్య 12.5 మిలియన్ల కు తగ్గింది. ఇక ట్విట్టర్ లో దాదాపు 5 లక్షల మంది వరకు ఫాలోవర్లు అన్ ఫాలో చేశారు. ఇక మొత్తానికి రెండు ప్లాట్ ఫామ్ లో కలిపి 8 లక్షల మంది ముంబై ఇండియన్స్ కి షాక్ ఇచ్చారు…
నిజానికి ముంబై టీమ్ రోహిత్ శర్మని కెప్టెన్ గా తప్పించడం వల్ల ఆయనకి ముంబై యాజమాన్యం తీవ్రమైన అన్యాయం చేసిందనే చెప్పాలి.ఇక హార్దిక్ పాండ్యా ని టీమ్ లోకి తీసుకున్నప్పటికీ ఒక రెండు సీజన్ ల వరకు రోహిత్ శర్మని కెప్టెన్ గా కంటిన్యూ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఫామ్ లో ఉన్నా లేకపోయిన కూడా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని ఒకసారి ఛాంపియన్ ట్రోఫీని అందించిన కెప్టెన్ గా ముంబై టీమ్ కనీసం ఆయనకి కొంత మాత్రం గౌరవాన్ని కూడా ఇవ్వకుండా ఇలా సడన్ తీసేయడం కరెక్ట్ కాదు.
ఆయనని ఇంకో రెండు సీజన్ల వరకు అలాగే కంటిన్యూ చేస్తే బాగుండేది ఒక్కసారిగా ఆయనని తీసేయడం ముంబై ఇండియన్స్ చేసిన పెద్ద తప్పుగా అందరు పరిగణిస్తున్నారు. ఈ విషయం లో ప్రస్తుతం ఇండియన్ టీమ్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ కి తీరని అవమానం, అన్యాయమైతే జరిగింది…