Homeక్రీడలుక్రికెట్‌Mumbai Indians Recent Losses Reasons IPL 2026: ముంబై ఓటములకు ఈమె కారణం.. మైదానంలోకి...

Mumbai Indians Recent Losses Reasons IPL 2026: ముంబై ఓటములకు ఈమె కారణం.. మైదానంలోకి రాకుండా దూరం పెట్టండి

Mumbai Indians Recent Losses Reasons IPL 2026: ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు విజేతగా నిలిచి.. సరికొత్త రికార్డు సృష్టించింది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ నాయకత్వంలో అద్భుతమైన విజయాలను అందుకుంది. అయితే కొంతకాలంగా ముంబై ఇండియన్స్ ఆశించిన స్థాయిలో ఆడలేక పోతోంది. స్టార్ ప్లేయర్ లు ఉన్నప్పటికీ ఆకట్టుకునే ఆట తీరు ప్రదర్శించలేకపోతోంది. దీంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల ఆట తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా ఉన్న ఆటగాళ్లలో మెజారిటీ ప్లేయర్లు ముంబై ఇండియన్స్ లో ఉన్నారు. ఆ స్థాయిలో ఆటగాళ్లు ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ గొప్ప ఆట తీరును కొనసాగించలేకపోతోంది. పైగా ఆటగాళ్ల మధ్య విభేదాలు కూడా ఆ జట్టు విజయాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా 2024లో హార్దిక్ పాండ్యాను నాయకుడిగా తీసుకొచ్చిన తర్వాత ముంబై ఇండియన్స్ పూర్తిగా గాడి తప్పింది. గత ఏడాది ప్లే ఆఫ్ దాకా వెళ్ళినప్పటికీ.. చివర్లో పంజాబ్ ముందు తలవంచింది. వాస్తవానికి ముంబైలో ఉన్న ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరిశీలనలోకి తీసుకుంటే.. పంజాబ్ ఎదుట ఓడిపోవాల్సిన ఖర్మ ముంబై జట్టుకు లేదు.

ముంబై జట్టు హార్దిక్ పాండ్యా నాయకత్వంలో అంత గొప్పగా రావటం లేదు. క్రీడా స్ఫూర్తిని ఆటగాళ్లు ప్రదర్శించడం లేదు. పైగా విబేధాలు కూడా ఆ జట్టు కొంపముంచుతున్నాయి. బయటికి చెప్పడానికి ఇష్టపడకపోయినప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ మధ్య విభేదాలు కొనసాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. జట్టులో ప్లేయర్లు వర్గాలుగా విడిపోయారని.. అందువల్లే సమిష్టి తత్వాన్ని చూపించలేకపోతున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ముంబై జట్టు ఓటములకు కారణాలు ఇవైతే.. కనిపించని మరో కారణం ఉందని అభిమానులు అంటున్నారు. ఏకంగా సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. హార్దిక్ పాండ్యా ఆడుతున్నప్పుడు అటెన్షన్ కోల్పోతున్నాడని.. దీనికి ప్రధాన కారణం అతడి స్నేహితురాలు అని కొందరు అభిమానులు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యస్నేహితురాలిని మైదానంలోకి రాకుండా చూస్తే సరిపోతుందని.. అప్పుడు ముంబై ఇండియన్స్ కచ్చితంగా గెలుస్తుందని వారు చెబుతున్నారు. అయితే హార్దిక్ పాండ్యా ఆటతీరు మీద ఎటువంటి అపోహలు అవసరం లేదని.. అనవసరంగా అతడి స్నేహితురాలి మీద విమర్శలు చేయడం సరి కాదని అభిమానులు అంటున్నారు.. ముంబై ఇండియన్స్ జట్టు ఓటమికి ఆమెను సాకుగా చూపించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular