https://oktelugu.com/

MI vs DC : సూర్యకుమార్ ఫెయిల్.. ఈ ఆల్ రౌండర్ సూపర్ హిట్.. 360 బ్యాటింగ్ వీడియో వైరల్

వాస్తవానికి ఈ స్థాయి బ్యాటింగ్ ను ముంబై ఆటగాళ్లు, అభిమానులు సూర్య కుమార్ యాదవ్ నుంచి ఆశించారు. కానీ అతడు వారందరి అంచనాలపై నీళ్లు చల్లుతూ డక్ ఔట్ గా వెనుతిరిగాడు.

Written By:
  • NARESH
  • , Updated On : April 7, 2024 / 09:10 PM IST

    Suryakumar-Yadav-MI

    Follow us on

    MI vs DC : సూర్య కుమార్ యాదవ్.. ఢిల్లీ అభిమానుల కళ్ళు మొత్తం అతని మీదే ఉన్నాయి. అతడు మైదానంలో అడుగుపెట్టడమే ఆలస్యం.. గోలలతో హోరెత్తిపోయింది. మిస్టర్ 360 అనే నినాదాలతో సందడిగా మారింది. అభిమానులు అధికంగా అంచనాలు పెంచుకున్నారో, లేక అతడికే ఆరోగ్యం సహకరించలేదో, సుదీర్ఘకాలం మైదానానికి దూరం కావడంతో ఒత్తిడిలో ఉన్నాడో తెలియదు కానీ.. మొత్తానికి సున్నా పరుగులకే ఔటయ్యాడు. అంతే స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న సూర్యును చూసి అభిమానులు బాధపడ్డారు. మిస్టర్ 360 బ్యాటింగ్ చూడలేకపోయామని ఆవేదన చెందారు. కానీ అతడు ఔట్ అయితే ఏం? నేనున్నా అంటూ మైదానంలోకి వచ్చి వీరోచిత బ్యాటింగ్ చేశాడు షెఫార్డ్. తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 18 ఓవర్ లో క్రీజులోకి అడుగుపెట్టాడు షెఫార్డ్. వచ్చి రావడంతోనే మైదానంలో పరుగుల సునామీని సృష్టించాడు. కేవలం పది బంతుల్లోనే 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

    నోకియా బౌలింగ్ లో..

    ముంబై ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను ఢిల్లీ బౌలర్ నోకియా వేశాడు. అతడి బౌలింగ్ లో షెఫార్డ్ బ్యాట్ తో మైదానంలో తాండవం చేశాడు. వరుసగా 4, 6, 6, 6, 4, 6 బాది 32 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్ విధ్వంసానికి ముంబై స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.. నోకియా వేసిన తొలి బంతిని స్ట్రైట్ షాట్ తో బౌండరీ సాధించిన షెఫార్డ్.. తర్వాతి బంతిని లాంగ్ ఆన్, డీప్ స్క్వేర్, స్వీపర్ కవర్ మీదుగా సిక్స్ కొట్టాడు.. ఇలా మిగతా బంతులను కూడా సిక్సర్లుగా మలిచాడు. ఐదో బంతిని బలంగా కొట్టడంతో అది బౌండరీ లైన్ దాటింది. చివరి బంతిని మరింత బలంగా కొట్టి సిక్సర్ గా మలిచాడు. ఫలితంగా చివరి ఓవర్ లో ముంబై జట్టుకు ఏకంగా 32 పరుగులు వచ్చాయి.

    వాస్తవానికి ఈ స్థాయి బ్యాటింగ్ ను ముంబై ఆటగాళ్లు, అభిమానులు సూర్య కుమార్ యాదవ్ నుంచి ఆశించారు. కానీ అతడు వారందరి అంచనాలపై నీళ్లు చల్లుతూ డక్ ఔట్ గా వెనుతిరిగాడు. అతడు అవుటైనప్పటికీ.. ఆ స్థానాన్ని తన వీరోచిత బ్యాటింగ్ తో షెఫార్డ్ భర్తీ చేశాడు. మైదానం ఉన్న ప్రేక్షకులకు అసలు సిసలైన టీ – 20 మజా అందించాడు. షెఫార్డ్ దూకుడు బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అతని బ్యాటింగ్ చూసిన నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.. ఇన్నాళ్లు నిన్ను హార్దిక్ పాండ్యా గుర్తించలేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.