MS Dhoni: ధోని కి కూడా డాట్ బాల్స్ వేశాడంటే ఆ బౌలర్ మామూలోడు కాదు రా..ఆ గుండె బతకాలి..

ఢిల్లీ బౌలర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ని అందించడంతో చెన్నై టీం మ్యాచ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక అందులో భాగంగానే ధోని లాంటి ఒక డైనమిక్ ప్లేయర్ క్రీజ్ లో ఉన్నప్పుడు ఏ బౌలర్ అయిన సరే బాల్ వేయాలంటే చేయి భయంతో వణుకుతుంది.

Written By: Gopi, Updated On : April 1, 2024 10:31 am

Mukesh Kumar rattle CSK

Follow us on

MS Dhoni: గత ఐపిఎల్ సీజన్ల తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇక రీసెంట్ గా ఢిల్లీ వర్సెస్ చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తో ఈ సీజన్ భారీగా బ్లాస్ట్ అయింది అనే చెప్పాలి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్ ను చూడడమే కాకుండా ధోని బ్యాటింగ్ ని విపరీతంగా ఎంజాయ్ చేస్తూ మరి ఐపీఎల్ సీజన్ కి భారీ బూస్టప్ ని అందించారు. ఇక ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్స్ చివరి వరకు సస్పెన్స్ ను కొనసాగిస్తూ మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లారు.

ఇక చివరి నిమిషంలో ఢిల్లీ బౌలర్లు అద్భుతమైన పర్ఫామెన్స్ ని అందించడంతో చెన్నై టీం మ్యాచ్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక అందులో భాగంగానే ధోని లాంటి ఒక డైనమిక్ ప్లేయర్ క్రీజ్ లో ఉన్నప్పుడు ఏ బౌలర్ అయిన సరే బాల్ వేయాలంటే చేయి భయంతో వణుకుతుంది. ఆ బౌలర్ ప్రమేయం లేకుండానే బాలు ముందుకు పడుతుంది.

ఇక ధోని లాంటి ఒక ధనాధన్ ఫినిషర్ ని ముందు పెట్టుకొని కూడా ఏమాత్రం భయం లేకుండా ముఖేష్ కుమార్ వేసిన 19 వ ఓవర్ లో మూడు డాట్ బాల్స్ వేయడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బౌలర్ బాల్ వేయాలంటే భయంతో వణికి పోతారు. అలాంటిది ముఖేష్ కుమార్ ధోని ని సైతం కట్టడి చేస్తూ అతను వేసిన బంతులు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. ఇక క్రీజ్ లో ధోనిని చూస్తేనే బౌలర్లు సగం చచ్చిపోతారు.

ఎందుకంటే ఆయన కొట్టే షాట్లు కి ఆ బౌలర్ యొక్క పరువు మొత్తం పోతుందనే భయంతో చాలా జాగ్రత్తగా బౌలింగ్ వేస్తుంటారు. కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో ముఖేష్ కుమార్ మాత్రం ధోని ని కట్టడి చేయడమే కాకుండా పరుగులు కూడా భారీగా ఇవ్వకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేసి డిల్లీ టీం విజయంలో కీలక పాత్ర వహించాడు…