MS Dhoni: వరల్డ్ కప్ అయినా.. ఐపీఎల్ కప్ అయినా.. ప్లేయర్స్ చేతికి గెలిచిన కప్ ఇస్తేనే ధోనీకి ఆనందం. ఇలా తాజాగా మరోసారి నెటిజన్ల మనసు దోచుకున్నాడు మిస్టర్ కూల్. సోమవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. రికార్డు విక్టరీ సాధించినప్పటికీ కెప్టెన్ ధోనీ చేసిన పని మరోసారి అందరినీ ఆశ్చర్యపర్చింది. ధోనీ అంటే ఇదే కదా అనిపించేలా చేసింది.
రాయుడికి ట్రోఫీ..
ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. దీని తర్వాత ట్రోఫీ అందుకునేందుకు ధోనీ వెళ్లాల్సి ఉంది. అయితే అతడితోపాటుగా అంబటి రాయుడు, జడేజాలను కూడా తీసుకెళ్లాడు కెప్టెన్. ఐపీఎల్ 2023 ట్రోఫీని వారికే ఇప్పించాడు. దీంతో నెటిజన్లు మరోసారి ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆకిక్కు వారికే దక్కాలని..
జట్టు విజయం సాధించినప్పుడు కప్ తీసుకుంటే అదో కిక్కు. అలాంటిది ధోనీ తీసుకోకుండా.. ఆ కిక్కు జట్టుకు చిరస్మరణీయ విజయం అందించిన జడేజా.. రిటైర్మెట్ ప్రకటించిన అంబటి రాయుడుకు దక్కాలని భావించాడు ధోనీ. ఈమేరకు ట్రోఫీని వారికే ఇప్పించాడు. ఈ నిర్ణయం అందరినీ మరోసారి ఆశ్చర్యానికి గురిచేసింది. ధోనీ అంటే ఇదే కదా అనుకుంటున్నారు. ధోనీ విలక్షణమైన పద్ధతికి మరోసారి సెల్యూట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
రాయుడు రిటైర్.. జడేజా విన్నింగ్ షాట్..
రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ అతడి కెరీర్లో చివరిది. ఐపీఎల్ ఫైనల్స్ లో గెలిచేందుకు జడేజా కీలక పాత్ర పోషించాడు. 2 బంతుల్లో 10 పరుగులు చేసి టైటిల్ గెలించేందుకు కారణమయ్యాడు. ఒకవేళ ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అయినా కావొచ్చు. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.
రాయుడిపై ప్రశంసలు..
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌లో ధోని అంబటి రాయుడు గురించి మాట్లాడాడు. ‘రాయుడు ప్రత్యేకత ఏమిటంటే, అతను తన ఫీల్డ్‌లో ఉన్నప్పుడు 100 శాతం ఇస్తూ ఉంటాడు. ఎల్లప్పుడూ జట్టుకు సహకరించాలని కోరుకుంటాడు. అతను అద్భుతమైన క్రికెటర్. నేను అతనితో చాలా కాలంగా ఆడుతున్నాను. అతను స్పిన్, పేస్ సమానంగా ఆడగల ఆటగాడు. ఇది నిజంగా ప్రత్యేకమైనది. ఈ గేమ్ రాయుడికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అతను కూడా నా లాంటి వాడు.. ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వ్యక్తి కాదు. రాయుడి మంచి కెరీర్‌ను కలిగి ఉన్నాడు. తన జీవితంలోని తదుపరి దశను ఆనందిస్తాడని ఆశిస్తున్నాను.’ అని తెలిపాడు.
……..!
Chennai Super Kings Captain MS Dhoni receives the #TATAIPL Trophy from BCCI President Roger Binny and BCCI Honorary Secretary @JayShah #CSKvGT | #Final | @msdhoni pic.twitter.com/WP8f3a9mMc
— IndianPremierLeague (@IPL) May 29, 2023