Homeక్రీడలుMS Dhoni: చిరుత వేగం.. మెరుపు కదలిక.. ఎమ్మెస్ ధోని క్యాచ్.. వీడియో వైరల్

MS Dhoni: చిరుత వేగం.. మెరుపు కదలిక.. ఎమ్మెస్ ధోని క్యాచ్.. వీడియో వైరల్

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియాలో ఈ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. వన్డే క్రికెట్ వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలలో టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించిన ఘనత అతడి సొంతం. ప్రస్తుతం ధోనీ వయసు 42 సంవత్సరాలు. గుజరాత్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్లో అతడు పట్టిన క్యాచ్ చూస్తే.. అక్కడికి 42 ఏళ్ల వయసు ఉంటుందా? అని ఎవరికైనా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే అతడు పట్టిన క్యాచ్ అలా ఉంది మరి. ఐపీఎల్ 2024 లో భాగంగా గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ధోని తనకు మాత్రమే సొంతమైన వికెట్ కీపింగ్ తో అలరించాడు. మైదానంలో తన మ్యాజిక్ ప్రదర్శించాడు.

వికెట్ల వెనకాల గోడలాగా నిలబడి ఉండే ధోని.. అద్భుతమైన క్యాచ్ పట్టి గుజరాత్ ఆటగాడు విజయ శంకర్ ను అవుట్ చేశాడు. దీంతో శంకర్ నిరాశగా పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన గుజరాత్ జట్టు.. శంకర్ వికెట్ కూడా కోల్పోవడంతో మరింత కష్టాల్లో పడింది. మిచల్ వేసిన ఎనిమిదవ ఓవర్ మూడో బంతి ఆప్ స్టంప్ దిశగా వెళ్ళింది. అయితే దానిని శంకర్ కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ అది బ్యాట్ చివరి అంచుకు తగిలి.. స్లిప్ వైపు కదిలింది.

ధోని ఒక్క ఉదుటన స్లిప్ వైపు వెళుతున్న బంతిని అద్భుతంగా అందుకున్నాడు. సూపర్ మాన్ తరహాలో డైవ్ చేసి ఆ బంతిని ఒడిసిపట్టాడు. దీంతో విజయ్ శంకర్ బ్యాడ్ లక్ అనుకుంటూ వెళ్లిపోయాడు. సూపర్ మాన్ తరహాలో క్యాచ్ పట్టిన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనికి అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. 42 సంవత్సరాల వయసులో తిరుగులేని క్యాచ్ అందుకున్నాడని, అతడి ఫిట్నెస్ చూస్తుంటే మరో రెండు సంవత్సరాల పాటు క్రికెట్ ఆడే అవకాశం ఉందని చెబుతున్నారు. సమకాలీన క్రికెట్లో ధోని తో పోటీపడే ఆటగాడు లేడని వ్యాఖ్యలు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Oktelugu Epaper