spot_img
Homeక్రీడలుక్రికెట్‌MS Dhoni Chennai management controversy: ధోనిని చెన్నై యాజమాన్యం కావాలనే అలా చేస్తోందా.. ఇలాగైతే...

MS Dhoni Chennai management controversy: ధోనిని చెన్నై యాజమాన్యం కావాలనే అలా చేస్తోందా.. ఇలాగైతే కష్టమే

MS Dhoni Chennai management controversy: రేపు వస్తాడు.. మాపు వస్తాడు. బరిలోకి దిగుతాడు.. దుమ్ము లేపుతాడు. దుమారం స్థాయిలో పరుగులు తీస్తాడు.. ప్రత్యర్థి బౌలర్లూ పారా హుషార్…అతడి దూకుడును ఆపండి.. ఇదిగో ఇలానే సాగిపోతోంది ధోని విషయంలో మీడియా హడావిడి.

మీడియాలో వార్తలు రావడం.. చెన్నై మేనేజ్మెంట్ లీకులు ఇవ్వడం.. సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇవ్వడంతోనే ధోని సగం ఐపీఎల్ ఆడేసినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ధోని ఆరోగ్యం అంత గొప్పగా లేదు. అతని వయసు కూడా క్రికెట్ ఆడేందుకు అంతగా సహకరించదు. ఈ విషయం చెన్నై మేనేజ్మెంట్ కు కూడా తెలుసు. కానీ ధోని ఆడలేని విషయాన్ని చెన్నై మేనేజ్మెంట్ అంత ఈజీగా ఒప్పుకోదు. పైగా ధోని ఒకవేళ స్ట్రెచర్ మీద ఆసుపత్రిలో ఉన్నా సరే.. చెన్నై మేనేజ్మెంట్ అతడితో ఆడించేందుకు సిద్ధంగా ఉంటుంది. ఈ మాట స్వయంగా ధోనినే చెప్పాడు.

ఇప్పటి ఐపీఎల్ సీజన్ లో ధోని రాక ఇంకా సందిగ్ధంగానే ఉంది. ఇటీవల అతడు ఫిట్ గా ఉన్నాడని చెన్నై మేనేజ్మెంట్ ప్రకటించింది. త్వరలోనే అతడు మైదానంలోకి దిగుతాడని ప్రకటించింది. కానీ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ధోని మళ్లీ గాయపడ్డాడు. దీంతో కథ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ధోని గురించి చెన్నై జట్టు మాజీ ఆటగాడు అశ్విన్ ఒక కీలక విషయాన్ని బయట పెట్టాడు.

ధోని ని ఇప్పట్లో చెన్నై మేనేజ్మెంట్ రంగంలోకి దింపే అవకాశాలు లేవట. ఎందుకంటే పాయింట్ల పట్టికలో చెన్నై జట్టు ఐదవ స్థానంలో కొనసాగుతోంది. వచ్చే మ్యాచ్లలో చెన్నై గనుక విజయాలు సాధిస్తే కచ్చితంగా ప్లే ఆఫ్ దాకా వెళ్తుంది. అలాంటప్పుడు ధోని దింపి ఆ అవకాశాలను ప్రమాదంలో పడేయాలని చేనే మేనేజ్మెంట్ అనుకోదు. ఒకవేళ చెన్నై జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు లేకపోతే.. ధోనిని రంగంలోకి దింపుతుంది. అప్పుడు ధోని పేరు చెప్పి ప్రేక్షకులను మైదానంలోకి భారీగా రప్పిస్తుంది. ఎలాగూ ధోని ఆరోగ్యం కూడా బాగోలేదు కాబట్టి.. ఘనంగా ఫేర్వెల్ ఇచ్చినట్టు ఉంటుందని చెన్నై మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే అశ్విన్ చేసిన వ్యాఖ్యల పట్ల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ధోని విషయంలో చెన్నై మేనేజ్మెంట్ అలా చేయదని.. చేయాలని కూడా అనుకోదని అభిమానులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version