Rahul Dravid Birthday: వివాదాలకు దూరంగా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్.. క్రికెట్ అభిమానుల ఫేవరెట్ క్రికెటర్ అని చెప్పొచ్చు. బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్ గా, కెప్టెన్‌గా భారత జట్టుకు ద్రావిడ్ తన సేవలు అందించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కూడా ఆయన భారత క్రికెట్‌కు సేవలు అందిస్తున్నాడు. ఈయన్ను ముద్దుగా ‘ది వాల్’ అని క్రికెటర్స్ పిలుచుకుంటుంటారు. మిస్టర్ డిపెండబుల్ అయిన రాహుల్ ద్రావిడ్ లైఫ్‌లోని విశేషాలను తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ స్టేట్‌లోని ఇండోర్ కు చెందిన రాహుల్ ద్రావిడ్..మరాఠి కుటుంబంలో జన్మించాడు. బెంగళూరులో పెరిగిన రాహుల్.. అక్కడే క్రికెట్ పాఠాలను నేర్చుకున్నాడు. అండర్-19లో కర్నాటక జట్టు తరఫున ఆడిన.. రాహుల్ ద్రావిడ్ 1996లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం.. 1996 ఏప్రిల్ 3న శ్రీలంక పై వన్డే మ్యాచ్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా మ్యాచుల్లో ద్రావిడ్ ఒంటరి పోరాటం చేసి భారత క్రికెట్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తనపై వచ్చిన విమర్శలు అన్నిటికీ మాటల ద్వారా కాకుండా తన బ్యాట్ ద్వారానే సమాధానాలిచ్చాడు రాహుల్ ద్రావిడ్. ఈ క్రమంలోనే ఆయన్ను ‘ది వాల్, మిస్టర్ డిపెండబుల్ ’ అని క్రికెట్లరు ముద్దుగా పిలుచుకుంటారు.
Also Read: తమిళ్ తలైవాస్ ఆడిన ‘విధ్వంసం’.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
రాహుల్ ద్రావిడ్ క్రికెటర్ గా తన కెరీర్ మొత్తంలో 164 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈయన ఒకే ఒక అంతర్జాతీయ టీ20 ఆడాడు. ద్రావిడ్ టీమిండియా కెప్టెన్‌గానూ వ్యహరించాడు. 2012లో రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అయితే, రాహుల్ ఐపీఎల్‌లో మాత్రం సత్తా చాటాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ తరఫున 89 మ్యాచ్‌లు ఆడిన ద్రావిడ్.. 2013 తర్వాత ఐపీఎల్‌కూ గుడ్ బై చెప్పాడు.
ఆ తర్వాత అండర్-19, భారత్-ఎ జట్లకు ఆయన చీఫ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2017లో టీమిండియా కోచ్‌గా కూడా బాధ్యతలు చేపట్టాల్సిందిగా బీసీసీఐ ప్రతినిధులు కోరారు. కానీ, ద్రావిడ్ అందుకు తిరస్కరించాడని బీసీసీఐ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా రాహుల్ ద్రావిడ్ కొనసాగుతున్నాడు. రాహుల్ ద్రావిడ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఆయన నాగ్ పూర్ కు చెందిన వైద్యురాలు విజేత పెంధార్కర్ ను మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.
Also Read: రిషబ్ పంత్ కు ఏమైంది? ఏందుకీ వైఫల్యాలు?