Homeక్రీడలుIPL 2023: ఆ రికార్డ్ సమం చేయడానికి సిక్స్ దూరంలో..!

IPL 2023: ఆ రికార్డ్ సమం చేయడానికి సిక్స్ దూరంలో..!

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో అరుదైన రికార్డు సమం అయ్యేందుకు అడుగు దూరంలో ఉంది. ఐపీఎల్ లో సిక్సర్ల మోత మోగుతోంది. ప్రతి మ్యాచ్ లోను కనీసం ఐదు నుంచి పది సిక్సర్లు బాదుతున్నారు బ్యాటర్లు. ఈ క్రమంలోనే మరో అరుదైన రికార్డును సమం చేసేందుకు ఈ ఏడాది ఐపీఎల్ అడుగు దూరంలో నిలిచి ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 999 సిక్సర్లు నమోదు కాగా, మరొకటి కొడితే వేయి సిక్సర్ల రికార్డు సమం అవుతుంది. శనివారం నాటి మ్యాచ్ ఈ రికార్డు చెరిగిపోయి సరికొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది.

ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఆట. పరుగులు వరద పారే ఈ లీగ్ లో ఈ ఏడాది బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో అనేక రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో రికార్డు శనివారం నాటి మ్యాచ్ లో బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది. గడిచిన 15 సీజన్లలో అత్యధిక సిక్సులు 2021లో బాదారు. శుక్రవారం నాటి మ్యాచ్ తో గతేడాది కొట్టిన సిక్సులను ఈ సీజన్ సమం చేసెందుకు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరగనున్న మ్యాచ్ లో ఆ రికార్డు సమం కావడమే కాకుండా బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.

గతేడాది వేయి సిక్సర్లు నమోదు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏటా వందలాది సిక్సులు కొడుతుంటారు. ఈ ఏడాది కూడా బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అనేక మ్యాచ్ ల్లో పరుగులు వరద పారిస్తున్నారు. కొన్ని మ్యాచ్ ల్లో అయితే సిక్సుల మోత మోగుతోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ ల్లో 999 సిక్సర్లు కొట్టారు. గత ఏడాది ఐపీఎల్ మొత్తం వేయి సిక్సులు కొట్టారు. ఇంకా ఒక్క సిక్స్ బాదితే ఆ రికార్డు సమం అవుతుంది. అయితే ఈ ఏడాది మరిన్ని మ్యాచ్లు ఉన్నందున భారీగానే సిక్సులు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ లో ఆర్సిబి కెప్టెన్ డూ ప్లెసిస్ అత్యధికంగా 36 సిక్సులు కొట్టి అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు.

118 సిక్సులతో టాప్ లో కోల్ కతా..

ఇప్పటి వరకు అత్యధిక సిక్సులు కొట్టిన జట్ల జాబితాలో కోల్ కతా నైట్ రైడర్స్ టాప్ లో కొనసాగుతోంది. ఈ జట్టు 118 సిక్సులు కొట్టగా, పంజాబ్ జట్టు 117 తో రెండో స్థానంలో, 115 సికులతో ముంబై జట్టు మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. 112 సిక్సులతో రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానంలో, 105 సిక్సులతో చెన్నై సూపర్ కింగ్స్ 5వ స్థానంలో, 14 సిక్సులతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరో స్థానంలో, 103 సిక్సులతో లక్నో జట్టు ఏడో స్థానంలో, 87 సిక్సులతో గుజరాత్ టైటాన్స్ ఎనిమిదో స్థానంలో, 77 సిక్సులతో హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో, 61 సిక్సులతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పదో స్థానంలో కొనసాగుతున్నాయి. అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాళ్లు జాబితాలో 36 సిక్సులతో డూ
ప్లెసిస్ ప్రథమ స్థానంలో ఉండగా, శివమ్ దూబే 30 సిక్సులతో రెండో స్థానంలో, మ్యాక్స్ వెల్ 30 సిక్సులతో మూడో స్థానంలో, మార్కస్ స్టోయినీస్ 26 సిక్సులతో నాలుగో స్థానంలో, జైస్వాల్ 26 సిక్సులతో 5వ స్థానంలో ఉన్నాడు.

RELATED ARTICLES

Most Popular