https://oktelugu.com/

Virat kohli Birthday Gift : బర్త్ డే గిఫ్ట్ : సచిన్ రికార్డు సమం.. ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలతో కింగ్ ‘కోహ్లీ’

మొత్తంగా బర్త్ డే నాడు కోహ్లీ సెంచరీ కొట్టడం.. సచిన్ రికార్డును సమయం చేయడంతో సంబరాలు అంబరాన్నంటాయి.

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2023 / 06:25 PM IST
    Follow us on

    Virat kohli Birthday Gift : విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టాడు. ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ దుమ్మురేపాడు. 48 సెంచరీలతో ఉన్న విరాట్ కోహ్లీ నేడు మరో సెంచరీ చేసి దుమ్మురేపాడు. సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీలు (49)ను విరాట్ కోహ్లీ సమం చేశాడు. మరో సెంచరీ చేస్తే ఏకంగా సచిన్ రికార్డును కూడా అధిగమించడం ఖాయం.

    విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో తన 49వ సెంచరీని కొట్టిన తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత గ్రేట్ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.

    విరాట్ కోహ్లి 49వ వన్డే అంతర్జాతీయ సెంచరీతో సచిన్ రికార్డును సమం చేశాడు. సహచర భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ యొక్క మ్యాచ్‌ల సంఖ్య కంటే తక్కువ మ్యాచ్ లలోనే ఈ సెంచరీలు చేయడం విశేషం. కోహ్లి తన 35వ పుట్టినరోజున ఈ సెంచరీ చేయడంతో స్టేడియం మొత్తం కోహ్లీ బర్త్ డే గిఫ్ట్ తో ఉప్పొంగిపోయింది.

    దక్షిణాఫ్రికాపై 119 బంతుల్లో ఈ సెంచరీ చేశాడు. 2009 డిసెంబరు లో శ్రీలంకపై కోహ్లీ తన మొదటి ODI సెంచరీని కొట్టాడు. 14 సంవత్సరాల క్రితం ఇదే వేదికపై డిసెంబర్ 2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ తన తొలి ODI సెంచరీని సాధించాడు.

    35వ బర్త్ డే రోజున ఆదివారం కోల్‌కతాలో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్‌లో కోహ్లి దక్షిణాఫ్రికాపై 119 బంతుల్లో సెంచరీ చేయడంతో ఆ ఆనందం రెట్టింపు అయ్యింది. అభిమానులు కేరింతలతో బర్త్ డే విషెస్ లతో హోరెత్తించారు.

    వన్డే క్రికెట్‌లో 58.48 సగటుతో కోహ్లీ తన 49వ సెంచరీని స్కోర్ చేయడానికి కేవలం 277 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్టింది. కానీ సచిన్ టెండూల్కర్ 451 ఇన్నింగ్స్ లలో ఈ 49 సెంచరీలు చేయడం విశేషం. ఇన్నింగ్స్ లలో సచిన్ కంటే చాలా తక్కువ సంఖ్యలోనే కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలతో కోహ్లీ, సచిన్ ఇప్పుడు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

    కోహ్లి సహచరుడు రోహిత్ శర్మ 31 సెంచరీలతో ఆల్ టైమ్ జాబితాలో మూడో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ రికీ పాంటింగ్ (30), శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (28) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

    మొత్తంగా బర్త్ డే నాడు కోహ్లీ సెంచరీ కొట్టడం.. సచిన్ రికార్డును సమయం చేయడంతో సంబరాలు అంబరాన్నంటాయి.