https://oktelugu.com/

Virat Kohli vs Sachin : సచిన్ కు కోహ్లీకి అదే తేడా.. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే..?

వీళ్లిద్దరూ ఐపీఎల్ లో బెంగుళూర్ టీమ్ కి ఆడినప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిన విషయం మనకు తెలిసిందే...ఇక ఒక ఇండియన్ క్రికెటర్ రికార్డ్ ని మరో ఇండియన్ క్రికెటర్ బ్రేక్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : November 5, 2023 / 07:19 PM IST
    Follow us on

    Virat Kohli vs Sachin : ప్రపంచ క్రికెట్ చరిత్ర లో క్రికెట్ గాడ్ గా పేరు సంపాదించిన సచిన్ టెండూల్కర్ ఇండియన్ టీం కి తనదైన రీతిలో సేవలు అందించి ఇండియన్ టీం అంటే సచిన్ టెండూల్కర్, సచిన్ టెండూల్కర్ అంటే ఇండియన్ టీం అనేంత గొప్ప పేరు సంపాదించుకున్న ప్లేయర్ గా చరిత్రలో ఒక అద్భుతమైన రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలో సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరియర్లో 49 సెంచరీలు చేసి ఒక అద్భుతమైన రికార్డుని క్రియేట్ చేశాడు ఇక దాంతో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా వన్డే ఫార్మాట్ లో తనకంటూ ఒక రికార్డును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు…

    సచిన్ టెండూల్కర్ అంటే ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఒక అరుదైన గౌరవంతో పాటు అతన్ని ఇష్టపడే అభిమానులు కూడా ఉన్నారు ఇలాంటి క్రమంలో ఈయన రికార్డును బ్రేక్ చేయడం చాలా కష్టమని చాలా మంది అనుకున్నారు కానీ సరిగ్గా అదే టైంకి ఇండియన్ టీం లోకి వచ్చిన ఒక యువ కెరటం విరాట్ కోహ్లీ రన్ మిషన్ గా పేరు సంపాదించుకున్నాడు. కోహ్లీ కి సెంచరీలు చేయడం అంటే చేతులు కడుక్కున్నంత ఈజీగా మంచినీళ్లు తాగినంత సింపుల్ గా చేసేయడం అలవాటు…ఇక ఇలాంటి క్రమంలోనే వరుసగా సెంచరీలు చేస్తూ వస్తున్న విరాట్ కోహ్లీ 277 ఇన్నింగ్స్ లలో 49వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 451 ఇన్నింగ్స్ లో 29 సెంచరీలను నమోదు చేసుకోగా ఈ రికార్డుని కోహ్లీ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్న మ్యాచ్ లో సమం చేశాడు.ఇంకొక సెంచరీ చేస్తే సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ అవుతుంది.

    అయితే ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే సచిన్ టెండుల్కర్ విరాట్ కోహ్లీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే దానిమీద చర్చలు జరుగుతున్నాయి. నిజానికి సచిన్ చాలా సంవత్సరాల పాటు క్రికెట్ కి సేవలు అందించాడు అందులో భాగంగానే ఎవరు అడలేనన్ని ఎక్కువ మ్యాచ్ లు కూడా తను ఆడడం జరిగింది.ఇక ఇలాంటి క్రమంలో సచిన్ క్రియేట్ చేసిన మరో రికార్డ్ నీ కూడా కోహ్లీ బ్రేక్ చేశాడు. అదేంటి అంటే ఏడు సంవత్సరాల లో ఏడుసార్లు 1000 కి పైగా పరుగులు చేసిన ప్లేయర్ గా సచిన్ టెండుల్కర్ మీద ఒక రికార్డు ఉండేది.కోహ్లీ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 8 సార్లు ఒకే సంవత్సరంలో 1000 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ గా ఒక అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు.ఒక్కటనే కాదు సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన ప్రతి రికార్డ్ ని కూడా విరాట్ కోహ్లీ బ్రేక్ చేస్తూ వస్తూనే ఉన్నాడు.ఇక అందులో భాగంగానే ఇవాళ్ల 49వ సెంచరీని బ్రేక్ చేయడం జరిగింది. ఇక చేజింగ్ లో విరాట్ కోహ్లీ సెంచరీలు చేసిన మ్యాచ్ లు 90% విజయాలను అందుకున్నాయి. అలాగే మొదటి బ్యాటింగ్ చేసినప్పుడు కూడా తను సెంచరీలు చేసిన మ్యాచ్ లు చాలా వరకు వజాయలను అందుకున్నాయి…

    ఇక ఏ రికార్డులు ఎలా ఉన్నా ఈ 49 సెంచరీస్ చేయడంలో మాత్రం సచిన్ టెండుల్కర్ కంటే కోహ్లీనే ది బెస్ట్ బ్యాట్స్ మెన్ అని చాలామంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ప్రపంచం లోని చాలా మంది దిగ్గజ క్రికెటర్లు సైతం కోహ్లీ ని మెచ్చుకుంటూ ట్వీట్లు పెడుతున్నారు.ఇక కోహ్లీ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఏబి డివిలియర్స్ కూడా ఈ మ్యాచ్ ని చూస్తూ కొద్దిసేపు కామెంటేటర్ గా వ్యవహరించడం జరిగింది. ఇక అందులో భాగంగానే మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ ని కలిసి కంగ్రాట్స్ కూడా చెప్పడం జరిగింది.వీళ్లిద్దరూ ఐపీఎల్ లో బెంగుళూర్ టీమ్ కి ఆడినప్పుడు మంచి ఫ్రెండ్స్ అయిన విషయం మనకు తెలిసిందే…ఇక ఒక ఇండియన్ క్రికెటర్ రికార్డ్ ని మరో ఇండియన్ క్రికెటర్ బ్రేక్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

    ఇక కోహ్లీ సెంచరీ పైన సచిన్ స్పందిస్తూ ఇలా ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడారు. నా చివరి సెంచరీ చేయడానికి దాదాపు సంవత్సరం పట్టింది. కానీ  48 తర్వాత 49వ సెంచరీ త్వరగానే చేసి నా రికార్డ్ తో సమం చేశాడు విరాట్. రాబోయే కొద్ది రోజుల్లోనే 50 వ సెంచరీ చేసి నా రికార్డ్ ని బ్రేక్ చేయాలని కోరుకుంటున్న కంగ్రాట్స్ కోహ్లీ’ అని ట్వీట్ చేసి విరాట్ ను అందరికంటే ముందుగా సచిన్ ప్రశంసించడం విశేషం.