Most Expensive Players In IPL: ఐపీఎల్ మినీ వేలం (IPL mini auction 2026) జోరుగా సాగుతోంది. ప్రస్తుత సీజన్లో అత్యధిక పర్స్ వేల్యూ ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight riders) జట్టు ఆస్ట్రేలియా ఆటగాడు కెమెరూన్ గ్రీన్ (Cameron green) ను 25.20 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్( Kolkata night riders) దక్కించుకుంది.
25.20 కోట్లకు గ్రీన్ అమ్ముడుపోవడం ఒక రికార్డు అయితే.. ఫారిన్ ప్లేయర్లలో అత్యధిక దక్కించుకున్న ఆటగాడిగా అతడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో గ్రీన్ మూడవ అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ జాబితాలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. గత ఏడాది జరిగిన మెగా వేలంలో రిషబ్ పంత్ ను లక్నో జట్టు యాజమాన్యం 27 కోట్లకు దక్కించుకుంది. అదే ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు యాజమాన్యం శ్రేయస్ అయ్యర్ ను 26. 75 కోట్లకు సొంతం చేసుకుంది ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లుగా తొలి రెండు స్థానాలలో కొనసాగుతున్నారు.
గ్రీన్ ను ఆల్ రౌండర్ కేటగిరీలో కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం యజమాన్యం కొనుగోలు చేసింది. 2024 మినీ వేలం లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం స్టార్క్ ను 24.75 కోట్లకు దక్కించుకుంది. అప్పట్లో అదే హైయెస్ట్ రికార్డ్ గా ఉండేది. ఆ రికార్డును ఇప్పుడు గ్రీన్ బద్దలు కొట్టాడు.. స్టార్క్, గ్రీన్ ఇద్దరూ ఆస్ట్రేలియా ప్లేయర్లు కావడం విశేషం. గ్రీన్ పొట్టి ఫార్మాట్లో గట్టి రికార్డులను తన పేరు మీద సృష్టించుకున్నాడు. ఆల్ రౌండర్ కేటగిరీలో గ్రీన్ ను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
గ్రీన్ కొంతకాలంగా ఆస్ట్రేలియా టి20 జట్టులో స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు.. బ్యాటింగ్ లోను.. బౌలింగ్ లోను అదరగొడుతున్నాడు.. అతని ప్రతిభను చూసిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. అతడు జట్టు సాధించే విజయాలలో ముఖ్యపాత్ర పోషిస్తాడని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం బలంగా నమ్ముతోంది. 25.20 కోట్లకు గ్రీన్ ను కొనుగోలు చేసిన తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఆల్ రౌండర్ కేటగిరిలో అతనిని తీసుకున్నామని.. అతని ఆట తీరును కచ్చితంగా ఆస్వాదిస్తామని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం ప్రకటించింది.