Morne Morkel And Arshdeep Singh: ఇంగ్లీష్ జట్టు పై గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది..ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారీ స్కోర్ చేసినప్పటికీ ఓడిపోవడం పట్ల సగటు భారత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి ఆట తీరు జట్టుకు ఏమాత్రం మంచిది కాదని వారు హితవు పలుకుతున్నారు.
Also Read: స్వేచ్ఛకు గతంలోనే రెండు వివాహాలు.. పూర్ణచందర్ సంచలన లేఖ వైరల్
లీడ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ ఓడిపోయిన నేపథ్యంలో.. రెండవ టెస్టులో ఎలాగైనా గెలవాలని జట్టు ఆటగాళ్లు భావిస్తున్నారు. అంతేకాదు ఐదు టెస్టుల సిరీస్ ను సమం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మైదానంలో ఆటగాళ్లు తీవ్రస్థాయిలో సాధన చేస్తున్నారు. బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ లో ఆ విశ్రాంతస్థాయిలో శిక్షణ పొందుతున్నారు..
ఈ నేపథ్యంలోనే భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తో భారత ప్లేయర్లు గొడవపడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.. లెఫ్ట్ ఆర్మ్ పేసర్, రైట్ ఆర్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్ దీప్ సింగ్ గొడవ పడిన తీరు చర్చకు దారితీస్తోంది. అర్ష్ దీప్ సింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా మోర్కెల్ రెచ్చగొట్టినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో అర్ష్ దీప్ సింగ్ ను కింద పడేశాడు. తనకాళ్లతో బంధించాడు. ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేశాడు. చివరికి అనేక ప్రయత్నాల తర్వాత అతడి నుంచి అర్ష్ దీప్ సింగ్ విడిపించుకున్నాడు.. ఆ తర్వాత ఆకాశ్ సహాయంతో మోర్కెల్ పని పట్టాడు అర్ష్ దీప్ సింగ్. మోర్కెల్ కింద పడిన తర్వాత.. కొద్దిసేపు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత తన శక్తిని మొత్తం కూడ తీసుకొని పైకి లేచాడు.. ఆ తర్వాత మళ్లీ అర్ష్ దీప్ సింగ్ మీదకు వచ్చాడు. అతడి మీద ఏకంగా దూకాడు..అర్ష్ దీప్ సింగ్ మీద కూర్చున్నాడు. అతడి చేతులను గట్టిగా పట్టుకున్నాడు. అనంతరం చక్కిలిగింతలు పెట్టాడు..
రెండవ టెస్ట్ త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీమ్ ఇండియా ప్లేయర్లు తీవ్రంగాశ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైదానంలో కాస్త ఆటవిడుపుగా ఉంటుందని ఇలా సరదాగా ఫైటింగ్ చేశారు.. ఈ సరదా ఫైటింగ్ ద్వారా కాస్తలో కాస్త సాంత్వన పొందారు. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా ఆకాష్, అర్ష్ దీప్ సింగ్ తీవ్రంగా సాధన చేశారు. మోర్కెల్ వీరితో పదేపదే బౌలింగ్ ప్రాక్టీస్ చేయించాడు. ఆ తర్వాత ఆకాష్, అర్ష్ దీప్ సింగ్ మైదానంలో కాసేపు సేద తీరారు. ఆ తర్వాత కోచ్ మోర్కెల్ తో సరదాగా ఫైటింగ్ చేశారు. మరోవైపు గౌతమ్ గంభీర్ మిగతా ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయించాడు. గౌతమ్ గంభీర్ అటువైపు ఉండగానే వీరు ముగ్గురు ఇలా ఫైటింగ్ చేయడం విశేషం.. మరోవైపు రెండో టెస్టులో అర్ష్ దీప్ సింగ్ స్థానం లభించడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే బుమ్రా ఆరోగ్యం దృష్ట్యా రెండవ టెస్టుకు పూర్తిస్థాయిలో విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు తొలి టెస్ట్ లో విఫలమైన ప్రసిద్ కృష్ణ స్థానంలో ఆకాష్ కు చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఆకాష్ స్వింగ్ బంతులు వేయడంలో నిష్ణాతుడు. అందువల్లే అతడికి తోది జట్టులో చోటు కల్పిస్తారని తెలుస్తోంది.
A fun WWE fight by Morkel & Arshdeep [Ankan Kar] pic.twitter.com/bYmDPXUR3w
— Johns. (@CricCrazyJohns) June 28, 2025