Homeక్రీడలుక్రికెట్‌Mohammed Siraj Dating Rumors: ఆమెతో డేటింగ్.. మన సిరాజ్ భయ్యా దొరికేశాడు

Mohammed Siraj Dating Rumors: ఆమెతో డేటింగ్.. మన సిరాజ్ భయ్యా దొరికేశాడు

Mohammed Siraj Dating Rumors: సెలబ్రిటీలు డేటింగ్ చేయడం.. పెళ్లి చేసుకోవడం కామన్. నచ్చకపోతే విడిపోవడం కూడా కామనే.. సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలకు విపరీతమైన రీడబులిటీ ఉంటుంది. సెలబ్రిటీలు కూడా నిత్యం మీడియాలో నానుతూ ఉండడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరేమో అత్యంత గోప్యంగా తమ సంబందాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇంకొందరేమో బహిరంగంగానే వ్యవహారాలను సాగిస్తుంటారు.

టీమిండియాలో యంగ్ ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్నాడు హైదరాబాది మహమ్మద్ సిరాజ్. అతడు అద్భుతమైన బౌలింగ్ వేయడం ద్వారా స్వల్ప కాలంలోనే టీమ్ ఇండియాలో కీలకమైన ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ఐపీఎల్ లో కూడా సత్తా చూపిస్తున్నాడు. సిరాజ్ గతంలో ఓ గాయకురాలి మనవరాలితో సంబంధంలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ కూడా పుకార్లు మాత్రమేనని తర్వాత తేలింది. దీంతో సిరాజ్ గురించి మరో వార్త ఇంతవరకు మీడియాలో కనిపించలేదు. అయితే ఇప్పుడు సిరాజ్ ఒక వీడియో ద్వారా అడ్డంగా దొరికిపోయాడు. మసాలా వార్తలు రాసేవారికి కావాల్సినంత స్టఫ్ ఇచ్చి వెళ్ళిపోయాడు.

సిరాజ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ మహిరా శర్మతో డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం మొదలైంది. అహ్మదాబాద్ నగరంలోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరూ కనిపించారు. అంతేకాదు ఓకే ప్రాంతంలో వారిద్దరు ఉన్నారు. దీంతో వారి డేటింగ్ కు సంబంధించిన ఆరోపణలకు బలం చేకూరినట్టు అయింది.

గతంలో మహిరా తో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిని మహీర ఖండించింది. తాను ఎవరితోనూ సంబంధంలో లేనని ఆమె ప్రకటించింది. సిరాజ్ కూడా ఇన్ స్టా లో ఒక స్టోరీ పోస్ట్ చేశాడు. నిరాధారమైన వ్యాఖ్యలను చేయకూడదని సూచించాడు. ఆ తర్వాత ఆ పోస్ట్ అతను డిలీట్ చేశాడు. మళ్లీ ఇన్ని రోజులకు వారిద్దరు అహ్మదాబాద్ లోని ఓ రెస్టారెంట్లో కనిపించడం రకరకాల వదంతులకు కారణమవుతోంది. ఈసారి సిరాజ్ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular