https://oktelugu.com/

Mohammed Shami : టాలీవుడ్ లో నా ఫేవరెట్ హీరోలు వీళ్లే.. బయటపెట్టిన షమీ

ఇటీవల తన కూతురిని దగ్గరికి రానివ్వకుండా భార్య అడ్డుకుంటుందని షమీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 19, 2024 / 11:16 PM IST
    Follow us on

    Mohammed Shami : మనదేశంలో క్రికెట్ తర్వాత సినీ యాక్టర్ లకే అభిమానులు ఎక్కువుంటారు. అలాంటి క్రికెటర్లు కూడా సినీ యాక్టర్ లను అభిమానిస్తుంటారు. క్రికెట్ విస్తృతి, ఇండియన్ సినిమా మార్కెట్ పెరిగిన తర్వాత.. సినీ యాక్టర్లు, క్రికెటర్లు కలిసి కమర్షియల్ యాడ్స్ లో నటించడం మామూలయిపోయింది. సినిమా యాక్టర్లు, క్రికెటర్లు ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. చాలామంది క్రికెటర్లు బాలీవుడ్ సినీ యాక్టర్ లనే ఎక్కువగా అభిమానిస్తుంటారు. నిన్న మొన్నటి వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని మాత్రమే చెప్పేవాళ్ళు. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా కూడా బాలీవుడ్ స్థాయికి చేరుకుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతీయ భాష దర్శకులు, నటులు కొత్త తరహాలో సినిమాలు తీస్తుండడంతో.. వారు కూడా బాలీవుడ్ స్థాయిలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. మరోవైపు ఓటీటీలు చొచ్చుకు రావడంతో సినిమా కు భాషా భేదం లేకుండా పోతోంది. ఫలితంగా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయిన యాక్టర్లు గ్లోబల్ స్టార్లు అవుతున్నారు. తాజాగా ఒక కార్యక్రమం నిమిత్తం హైదరాబాద్ వచ్చిన భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ విలేకరులతో మాట్లాడారు. మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు అని విలేకరులు అడిగితే యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టమని తన మనసులో మాట బయటపెట్టారు. వారంటే ఎందుకు ఇష్టమని అడిగితే ఓటీటీ ల్లో వారి సినిమాలు చూస్తానని.. వారి నటన నచ్చుతుందని.. షమీ బదులిచ్చారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు క్రికెటర్ల పై ప్రాంతీయ సినిమాల ప్రభావం ఏ విధంగా ఉందో చెప్పడానికి.. ఓటీటీలు అందుబాటులోకి రావడం.. భాషా బేధం లేకుండా సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుండడంతో ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ప్రాంతీయ భాషా నటులకు క్రికెటర్లు అభిమానులయిపోతున్నారు.

    వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత మహమ్మద్ షమీ ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. వరల్డ్ కప్ లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో కార్పొరేట్ కంపెనీలు వివిధ ప్రకటనల నిమిత్తం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వాటి ప్రచారంలో భాగంగా మహమ్మద్ షమీ దేశంలో పలు ప్రాంతాలు తిరుగుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ వచ్చారు. అంతేకాదు ఇక్కడ బిర్యానీ అంటే చాలా ఇష్టమని.. ఉప్పల్ మైదానంలో పలుమార్లు మ్యాచ్ లు ఆడానని షమీ తన అనుభవాలు గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ ప్రేక్షకులు తనకు మద్దతుగా నిలిచారని కొనియాడారు.

    ఇక షమీ వైవాహిక జీవితం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. గతంలో అతని భార్య షమీ మీద వేధింపుల కేసు పెట్టింది. అప్పట్లో అందరూ షమీని తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అసలు వాస్తవాలు వెలుగులోకి రావడంతో షమీ మీద సానుభూతి చూపించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అయితే ఇటీవల తన కూతురిని దగ్గరికి రానివ్వకుండా భార్య అడ్డుకుంటుందని షమీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారు.