Mohammed Shami: ఐసీసీ వరల్డ్ కప్ -23 లో మహమ్మద్ షమీ ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మడమ నొప్పి వేధిస్తున్నప్పటికీ అతడి బౌలింగ్ ప్రదర్శన అమోఘం. ఏకంగా 24 వికెట్లు తీసి భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మడమ నొప్పి వేధిస్తున్నప్పటికీ అతడు ఏమాత్రం లెక్కచేయకుండా జట్టు కోసం ఆడాడు. ఆ టోర్నీ తర్వాత శస్త్ర చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిపోయాడు. ఇటీవల తన ఆపరేషన్ కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ఎక్స్ లో షమీ పోస్ట్ చేయడంతో.. త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉండే షమీ.. తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ ను ట్విట్టర్ ఎక్స్ ద్వారా పంచుకున్నాడు. ” హాయ్ ఎవరీ వన్.. శస్త్ర చికిత్స ముగిసింది. కుట్లు విప్పారు. ప్రస్తుతానికి కోలుకుంటున్నాను. నేను ఆస్పత్రిలో చికిత్స పొందబట్టి 15 రోజులు అవుతోంది. తదుపరి ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని” షమీ ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు..
ఈ ఫోటోలను చూసిన ఓ అభిమాని.. ఒక ప్రశ్న సంధించాడు. “స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో షమీ భాయ్ 100% తన శక్తిని ఆట మీద పెట్టాడు. కానీ ఓ ఆటగాడు తనకు గాయం కాకపోయినప్పటికీ.. గాయం అయినట్టు నటించాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్రమిస్తుంటాడు కావచ్చ” ని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. దీనికి షమీ ఔను అన్నట్టుగా లైక్ చేశాడు. టీమిండియా ఆల్రౌండర్, టీ- 20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా ను ఉద్దేశించి అన్నట్టుగా ఉన్న ఈ వ్యాఖ్యలను షమీ లైక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఆ తర్వాత ఆ టోర్నీకి దూరమయ్యాడు. గతంలో ఐపిఎల్ లో గుజరాత్ జట్టుకు అతడు కెప్టెన్ గా ఉండేవాడు. ప్రస్తుతం ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. షమీ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఆడుతున్నాడు. గాయం కారణంగా అతడు ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అన్ని కుదిరితే అతడు టీ- 20 వరల్డ్ కప్ న కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Hello everyone! I wanted to provide an update on my recovery progress. It has been 15 days since my surgery, and I recently had my stitches removed. I am thankful for the advancements I have achieved and looking forward to the next stage of my healing journey. pic.twitter.com/wiuY4ul3pT
— (@MdShami11) March 13, 2024